పారికర్ మాటలు చంద్రబాబు విన్నాడా?
తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ పై కేంద్రమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. అధికార పార్టీకి చురకలింటించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి చేర్చుకోవడం తగదని తెలంగాణ రాష్ట్ర సమితికి హితవు పలికారు. తెలంగాణలో వాస్తుపాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. సొంతంగా బలపడేందుకు ప్రయత్నించాలి తప్ప ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యలను కారెక్కించడం సరికాదని అభిప్రాయపడ్డారు. వెళ్లిన వారంతా తిరిగి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. మనోహర్ పారికర్ […]
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ పై కేంద్రమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. అధికార పార్టీకి చురకలింటించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి చేర్చుకోవడం తగదని తెలంగాణ రాష్ట్ర సమితికి హితవు పలికారు. తెలంగాణలో వాస్తుపాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. సొంతంగా బలపడేందుకు ప్రయత్నించాలి తప్ప ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యలను కారెక్కించడం సరికాదని అభిప్రాయపడ్డారు. వెళ్లిన వారంతా తిరిగి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. మనోహర్ పారికర్ మాటలను తెలంగాణ వైసీపీ నేతలు స్వాగతిస్తున్నారు. మీరు చెప్పే మంచిమాటలు మీ మిత్రపక్షం చంద్రబాబుకు చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పినదాంట్లో నిజముందని అంగీకరిస్తున్నాం.. మేము అడిగే ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
వీటికి బదులేది?
1. ఏపీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మభ్యపెడుతూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్న టీడీపీ అధినేతకు ఈ మాటలు చెప్పగలరా?
2. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా?
3. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో మీ స్పందన ఏంటి?
4. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిన మాట వాస్తవం కాదా?
5. ఉత్తరాఖండ్ లో పార్టీ ఫిరాయింపులు, ఉల్లంఘనలకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేపై ఆ రాష్ట్ర స్పీకర్ వేటు వేసిన విషయం వాస్తవం కాదా?
6. వైసీపీలో చేరిన ఎంపీలు గీతా, ఎస్పీవై రెడ్డిలను తిరిగి వైసీపీలో చేరాలని చెప్పగలరా?
7. పార్టీ మారినవారిపై వైసీపీ అధినేత జగన్ ఫిర్యాదు చేసి చాలాకాలమైంది. మరి ఈ విషయంలో చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబుకు చెప్పగలరా?
8. కేంద్రంలో ఉంది మీ సర్కారే కదా? వైసీపీ నుంచి పార్టీ మారిన ఎంపీలపై లోక్‌సభలో వేటు వేయలేరా?
Advertisement