చైనా యువకులారా...దేశానికి మీ వీర్యకణాలు కావాలి!
చైనా ప్రభుత్వం ఆ దేశపు యువతరానికి ఈ విజ్ఞప్తి చేసింది. దేశంలోని స్పెర్మ్ బ్యాంకుల్లో వీర్యకణాల కొరత తీవ్రంగా ఉందని, 20-45 మధ్య వయసున్న వారు దయచేసి స్పెర్మ్ ని దానం చేయాలని, దేశం కోసం మీరు ఈ పనిచేసి తీరాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. చైనా ప్రభుత్వం రెండవ బిడ్డకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కొరత మరింతగా ఉంది. ఇందుకోసం కాకపోయినా సాధారణంగా చూసినా కొరత చాలా ఎక్కువగా ఉందని స్పెర్మ్ బ్యాంకుల నిర్వాహకులు […]
చైనా ప్రభుత్వం ఆ దేశపు యువతరానికి ఈ విజ్ఞప్తి చేసింది. దేశంలోని స్పెర్మ్ బ్యాంకుల్లో వీర్యకణాల కొరత తీవ్రంగా ఉందని, 20-45 మధ్య వయసున్న వారు దయచేసి స్పెర్మ్ ని దానం చేయాలని, దేశం కోసం మీరు ఈ పనిచేసి తీరాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. చైనా ప్రభుత్వం రెండవ బిడ్డకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ కొరత మరింతగా ఉంది. ఇందుకోసం కాకపోయినా సాధారణంగా చూసినా కొరత చాలా ఎక్కువగా ఉందని స్పెర్మ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే స్పెర్మ్ ఇచ్చినవారికి వెయ్యి డాలర్ల వరకు పారితోషకం, ఐఫోన్ లాంటి బహుమతులను అందిస్తున్నారు. సోషల్ మీడియాలో యువతని ఆకట్టుకునే ప్రకటనలు, ప్రచారం చేస్తున్నారు.
చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ, యువతరం తగ్గిపోతున్నదృష్ట్యా… స్పెర్మ్ దానం, రక్తదానం అంత గొప్పదని, సమాజానికి తిరిగి ఇవ్వటంగా దీన్ని భావించాలనే ప్రచారం కూడా జరుగుతున్నది. చైనా సాంప్రదాయ వైద్యం దీర్ఘకాలంగా… వీర్యకణాలు వ్యక్తిలోని తేజస్సుకి చిహ్నమని చెబుతుండగా స్పెర్మ్ కొరతకి అదొక అడ్డంకిగా మారింది. అంతేకాక అక్కడ సంతానలేమి సమస్య తీవ్రంగా ఉన్నా దాత… వీర్యకణాల ద్వారా బిడ్డలను పొందితే తమ కుటుంబ విలువలు మారిపోతాయనే భయం కూడా చైనావారిని వేధిస్తోంది. కొంతమంది దాతలు ముందుకు వచ్చినా అందులో సగానికి సగంమంది స్పెర్మ్ పనికిరావటం లేదని ఒక అధ్యయనంలో తేలింది.
Click on Image to Read: