టీడీపీ నేత కందికుంట ప్రసాద్‌కు ఏడేళ్లు జైలుశిక్ష
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్‌కు జైలు శిక్ష పడింది. సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. కందికుంట ప్రసాద్, మాజీ మంత్రి షాకీర్‌లు నకిలీ డీడీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ. 10కోట్లు మోసం చేశారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. మోసం నిజమేనని తేల్చింది. కేసును విచారించిన సీబీఐ న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్ష విధించింది. షాకీర్‌కు ఐదేళ్ల జైలు, 5లక్షల జరిమానా విధించింది. […]
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్‌కు జైలు శిక్ష పడింది. సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. కందికుంట ప్రసాద్, మాజీ మంత్రి షాకీర్‌లు నకిలీ డీడీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ. 10కోట్లు మోసం చేశారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. మోసం నిజమేనని తేల్చింది. కేసును విచారించిన సీబీఐ న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్ష విధించింది. షాకీర్‌కు ఐదేళ్ల జైలు, 5లక్షల జరిమానా విధించింది. కందికుంట ప్రసాద్‌కు ఏడేళ్ల జైలు, ఆరు లక్షల జరిమానా పడింది. కందికుంట ప్రసాద్ ప్రస్తుతం కదిరి టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్నారు. ఈయనపై పలు ఆర్థిక అవకతకలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పరిటాల రవి వర్గానికి ముఖ్యనాయకుడిగా కందికుంట ప్రసాద్ ఉన్నారు.
Click on Image to Read: