జంప్? కార్యకర్తలతో భేటీ అయిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

ప్రకాశం జిల్లా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కందుకూరుఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గంలో కార్యకర్తలతో గురువారం భేటీలు నిర్వహించారు. టీడీపీ మహానాడు ముగిసిన తర్వాత వీరు టీడీపీలో చేరుతారని చెబుతున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ వీడుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. […]

;

Advertisement
Update:2016-05-26 14:12 IST
జంప్? కార్యకర్తలతో భేటీ అయిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
  • whatsapp icon

ప్రకాశం జిల్లా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కందుకూరుఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గంలో కార్యకర్తలతో గురువారం భేటీలు నిర్వహించారు. టీడీపీ మహానాడు ముగిసిన తర్వాత వీరు టీడీపీలో చేరుతారని చెబుతున్నారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ వీడుతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. ఈ విషయం తెలియడం వల్లే గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ అన్నారాంబాబు అసంతృప్తితో ఉన్నారు. అశోక్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన జిల్లా టీడీపీ మినీమహానాడుకు కూడా అన్నా రాంబాబు గైర్హాజరయ్యారు. ఆయన అనుచరులు కూడా మినీమహానాడుకు రాలేదు. ఇప్పటికే ప్రకాశం జిల్లా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డేవిడ్ రాజులు టీడీపీలో చేరారు.

Click on Image to Read:

pati-pati-pullarao-acham-na

Tags:    
Advertisement

Similar News