నాయుడిగారి దారి ఎటు?
బీజేపీ నేతలకు రాజ్యసభ సీటు ఇచ్చేది లేదని తేల్చేసిన లోకేశ్ మాటల్లో అనేక అర్థాలు ఉన్నాయి. మొదటిది ఆయన తెలంగాణ నేతలకు అవకాశం లేదని చెప్పాడు. రెండోది ఏపీకి చెందిన బీజేపీ నేత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని కూడా తమ వద్దకు రావద్దని చెప్పకనే చెప్పాడు. బీజేపీ దేశంలో చాలా రాష్ట్ర్ర్టాల్లో అధికారంలో ఉందని, ఆయా రాష్ర్టాల నుంచి ఆయనకు ఇచ్చుకోవచ్చ కదా! అని కమలనాథులకు రాజకీయ పాఠాలు కూడా చెప్పాడు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు కొంత […]
బీజేపీ నేతలకు రాజ్యసభ సీటు ఇచ్చేది లేదని తేల్చేసిన లోకేశ్ మాటల్లో అనేక అర్థాలు ఉన్నాయి. మొదటిది ఆయన తెలంగాణ నేతలకు అవకాశం లేదని చెప్పాడు. రెండోది ఏపీకి చెందిన బీజేపీ నేత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని కూడా తమ వద్దకు రావద్దని చెప్పకనే చెప్పాడు. బీజేపీ దేశంలో చాలా రాష్ట్ర్ర్టాల్లో అధికారంలో ఉందని, ఆయా రాష్ర్టాల నుంచి ఆయనకు ఇచ్చుకోవచ్చ కదా! అని కమలనాథులకు రాజకీయ పాఠాలు కూడా చెప్పాడు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు కొంత ఆగ్రహంగా ఉన్నట్లుగానే తెలుస్తోంది. రాష్ట్రం కోసం ఉభయసభల్లో పోరాడుతున్న తమ నేతను రావొద్దని ఇంత బహిరంగంగా చెప్పే అర్హత, అనుభవం లోకేశ్‌కు ఉన్నాయా? అని ప‌్రశ్నిస్తున్నారు. నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర రాజకీయాలపై మాకే పాఠాలు చెప్పేటంతటి వాడు అయ్యాడా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ కి కేంద్రంలో ఎంతో కొంతో ప్రాధాన్యం దక్కుతుందంటే దాని వెనక వెంకయ్య చేస్తోన్న కృషి అన్న సంగతి మరవడం మర్యాద అనిపించుకోదని హితవుపలుకుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీతో చెదురుతున్న మైత్రికి అద్దం పడుతోందా? లేదా నాయుడిగారి రాజ్యసభ సీటును మరో రాష్ట్రం నుంచి పక్కా చేసుకున్నాకే.. టీడీపీ ఇలా మాట్లాడుతోందా? అన్న సందేహాలను కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఏ గడప తొక్కుతాడు..?
రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో అందరి దృష్టి నాయుడిగారి మీదే పడింది. ఎందుకంటే.. పార్టీ తరఫున ఇప్పటికే మూడు సార్లు రాజ్యసభ సీటు పొందారు వెంకయ్యనాయుడు. పార్టీ నిబంధనల ప్రకారం.. ఇంకోసారి ఇవ్వడం కుదరదు. వెంకయ్య లాంటి సీనియర్, వాక్చాతుర్యం, లౌక్యం కలిగిన నేతను పార్టీ దూరం చేసుకుంటుందా? అంటే ముమ్మాటికీ వదులుకోదు. ప్రస్తుతం వెంకయ్య కర్ణాటక నుంచి నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి టికెట్ ఇచ్చేది లేదని కర్ణాటక నేతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ బీజేపీ అధిష్టానం వెంకయ్యను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకుంది. కానీ స్థానిక బీజేపీ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వెంకయ్య దిష్టిబొమ్మను తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచే పోటీ చేస్తారా లేక ఆత్మాభిమానంతో తనను వద్దంటున్న కర్ణాటకను వదిలేసి వేరే రాష్ట్రం నుంచి పోటీ చేస్తారా? అనేది తేలాలి. ఈ పరిస్థితుల్లో ఏ రాష్ర్టం గడప తొక్కుతారన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో ఉన్న సఖ్యత ఆ పార్టీకి ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య చూసి అంతా ఏపీ నుంచి నామినేట్ అవుతారన్న ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని ఇటీవల చంద్రబాబు, ఇప్పుడు లోకేశ్ కూడా ఖండించారు. దీంతో వెంకయ్యను అస్సోం నుంచి నామినేట్ చేయవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిని రాజకీయ విశ్లేషకులు కూడా సమర్థిస్తున్నారు.
Click on Image to Read: