అన్ని రాష్ట్రాలకు హోదా ఇస్తూ పోతే విలువేముంటుంది

ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అచ్చం చంద్రబాబు మాట్లాడిన తీరులోనే వెంకయ్య కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉన్న పది రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకవరుసలో ఉన్నాయని చంద్రబాబు ఇటీవల కామెంట్‌ చేశారు. వెంకయ్యనాయుడు కూడా ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికీ వెనుకబడేఉన్నాయని ఆ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన బీహార్‌, బెంగాల్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్ […]

Advertisement
Update:2016-05-26 17:31 IST

ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అచ్చం చంద్రబాబు మాట్లాడిన తీరులోనే వెంకయ్య కూడా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉన్న పది రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకవరుసలో ఉన్నాయని చంద్రబాబు ఇటీవల కామెంట్‌ చేశారు. వెంకయ్యనాయుడు కూడా ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికీ వెనుకబడేఉన్నాయని ఆ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన బీహార్‌, బెంగాల్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇలా 10, 15 రాష్ట్ర్రాలకు ప్రత్యేక హోదా ఇస్తూ పోతే ఇక విలువేముంటుందని ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదన్నారు. అప్పట్లో ఆ అంశాన్ని చట్టంలో పెట్టాలని తాను డిమాండ్ చేసినా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటని చంద్రబాబు తరహాలోనే వెంకయ్య ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై తుది నిర్ణయం మోదీదేనని వెంకయ్య స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చినన్నీ నిధులు మరే రాష్ట్రానికి ఇవ్వలేదని చెప్పారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదనడం అవాస్తవం అన్నారు. కొందరు తాను ఏపీకే అన్ని చేస్తున్నానంటూ కర్నాటకలో ఆందోళనలు చేయిస్తున్నారని వెంకయ్య ఆరోపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News