సైక్లింగ్‌కి సై...అంటే ఆరోగ్యమే!
సైకిల్ వాడకం ఎంత పెరిగితే అంతగా మనం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అయితే సైకిల్ వాడకం వలన వాతావరణ కాలుష్యమే కాదు, మన శరీరంలోని అనారోగ్యాలను కూడా తగ్గించుకోవచ్చు. సైక్లింగ్ వలన మనకు కలిగే ఆరోగ్యలాభాల గురించి- – రోజుకి 15-30 నిముషాల వరకు సైకిల్ తొక్కితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. -బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి వ్యాయామం. ఇది కేలరీలను సమర్ధవంతంగా కరిగిస్తుంది. -సైక్లింగ్ మనల్ని […]
సైకిల్ వాడకం ఎంత పెరిగితే అంతగా మనం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అయితే సైకిల్ వాడకం వలన వాతావరణ కాలుష్యమే కాదు, మన శరీరంలోని అనారోగ్యాలను కూడా తగ్గించుకోవచ్చు. సైక్లింగ్ వలన మనకు కలిగే ఆరోగ్యలాభాల గురించి-
– రోజుకి 15-30 నిముషాల వరకు సైకిల్ తొక్కితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం బాగా తగ్గిపోతుంది.
-బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి వ్యాయామం. ఇది కేలరీలను సమర్ధవంతంగా కరిగిస్తుంది.
-సైక్లింగ్ మనల్ని మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
-రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి సైక్లింగ్ కి ఉంది. సైకిల్ తొక్కడంతో కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా నివారించుకోవచ్చు.
-కండరాలు శక్తివంతంగా, బలిష్టంగా తయారవుతాయి. ముఖ్యంగా సైక్లింగ్ శరీరంలోని కింది భాగానికి ఆరోగ్యాన్నిస్తుంది.