పేపరుతో పాటు... ఓ భోజనం ప్యాకెట్!
టివిల్లో, కుకింగ్ వెబ్‌సైట్లలో రకరకాల ఊరించే వంటలు కనబడుతుంటాయి. వాటిని చూసి… మనం తయారుచేసుకోవాలి. కానీ అవే వంటలను మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే వీలు ఉంటే…మంచి ఆలోచనే. ప్రపంచస్థాయిలో అతిపెద్దదైన వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఇదే ప్రయోగాన్ని మొదలుపెట్టనుంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక పాఠకులు, ఎన్‌వైటి కుకింగ్ వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన వంటలను వెబ్‌సైట్ ద్వారా, లేదా మొబైల్ ద్వారా ఆర్డరు ఇవ్వవచ్చు. అవి పాఠకుల ఇళ్లకు […]
టివిల్లో, కుకింగ్ వెబ్‌సైట్లలో రకరకాల ఊరించే వంటలు కనబడుతుంటాయి. వాటిని చూసి… మనం తయారుచేసుకోవాలి. కానీ అవే వంటలను మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునే వీలు ఉంటే…మంచి ఆలోచనే. ప్రపంచస్థాయిలో అతిపెద్దదైన వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఇదే ప్రయోగాన్ని మొదలుపెట్టనుంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక పాఠకులు, ఎన్‌వైటి కుకింగ్ వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన వంటలను వెబ్‌సైట్ ద్వారా, లేదా మొబైల్ ద్వారా ఆర్డరు ఇవ్వవచ్చు. అవి పాఠకుల ఇళ్లకు వచ్చి చేరతాయి.
ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఆహార తయారీ చెఫ్…చెఫ్ డితో తాము అనుసంధానమవుతున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. చెఫ్ డి నుండి వారానికి ఇన్ని భోజనాలు కావాలని ముందుగానే ఆర్డరు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇందుకోసం న్యూయార్క్ టైమ్స్ కి చందా కట్టాల్సి ఉంటుంది. తాము చెఫ్ డితో కలవటం వలన, తమ సంస్థ ఇప్పటివరకు ప్రచురించిన, చూపించిన అత్యద్భుతమైన, విలాసవంతమైన ఫుడ్‌ని పాఠకులు రుచి చూసే అవకాశం కలుగుతుందని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది.
ఈ ఏడాది మొదటి మూడునెలల్లో న్యూయార్క్ టైమ్స్ ప్రింట్, డిజిటల్ ప్రకటనల ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పత్రిక ప్రపంచంలోనే ప్రముఖమైనదిగా పేరు తెచ్చుకున్నా, డిజిటల్ వెర్షన్లో ఇది ఇంకా తన సత్తాని చాటలేకపోతోంది. ముఖ్యంగా ఇంటర్‌నెట్‌లో మాత్రమే కనిపించే న్యూస్ వెబ్‌సైట్ల పోటీని ఇది తట్టుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో వ్యాపారాన్ని పెంచుకునే మార్గాలను ఆలోచిస్తోంది.