గల్లాపై హైకోర్టులో జేపీ పవన్ పిటిషన్

ఏపీ ఒలింపిక్ సంఘం వ్యవహారం టీడీపీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. ఎంపీ గల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐవోఏ జారీ చేసిన ఉత్తర్వులపై జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ హైకోర్టును ఆశ్రయించారు. ఐవోఏను హైజాక్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని పిటిషన్ లో ఆరోపించారు. ఐవోఏ అధ్యకుడు రామచంద్రన్ తో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గల్లా జయదేవ్ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. తమ ఆధ్వర్యంలో ఉన్నదే నిజమైన […]

Advertisement
Update:2016-05-03 10:33 IST

ఏపీ ఒలింపిక్ సంఘం వ్యవహారం టీడీపీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. ఎంపీ గల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐవోఏ జారీ చేసిన ఉత్తర్వులపై జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ హైకోర్టును ఆశ్రయించారు. ఐవోఏను హైజాక్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని పిటిషన్ లో ఆరోపించారు. ఐవోఏ అధ్యకుడు రామచంద్రన్ తో ఉన్న పరిచయాలను అడ్డుపెట్టుకుని గల్లా జయదేవ్ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. తమ ఆధ్వర్యంలో ఉన్నదే నిజమైన సంఘమని పవన్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీ ఒలింపిక్ సంఘానికి పవన్ రెడ్డి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

తమ సంఘంలో సభ్యుడిగా ఉన్న పురుషోత్తంతో కలిసి గల్లా జయదేవ్ ఒకే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేశారని పవన్ కోర్టు దృష్టికి తెచ్చారు. సదరు సంఘానికి వారే ఎన్నికలు నిర్వహించుకుని ఇప్పుడు తమదే అసలైన సంఘంగా ప్రకటించుకున్నారని జేసీ పవన్ ఆరోపించారు. ఐవోఏ అధ్యక్షుడు రామచంద్రన్ కుమారుడు గల్లా కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని, దీంతో ఐవోఏ అధ్యక్షుడు జయదేవ్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేశారని పవన్‌ తెలిపారు. రామచంద్రన్ జారీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని తన పిటిషన్ లో హైకోర్టును పవన్ రెడ్డి కోరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News