వచ్చే ఎన్నికల వరకే గ్యారెంటీ!
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి బీజేపీతో దోస్తిపై కామెంట్స్ చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతోందని వార్తల నేపథ్యంలో ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో స్పందించారు. బీజేపీతో వచ్చే సాధారణ ఎన్నికల వరకు కలిసి ప్రయాణం చేస్తామని ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుందన్న నమ్మకంతోనే ఎదురుచూస్తున్నామన్నారు. పవన్‌కల్యాణ్ విమర్శలపైనా గల్లా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర అభివృధ్ధికి ఎంపీలు కృషి చేయడం లేదని పవన్ కల్యాణ్ అనడం సమంజసం […]
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి బీజేపీతో దోస్తిపై కామెంట్స్ చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతోందని వార్తల నేపథ్యంలో ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో స్పందించారు. బీజేపీతో వచ్చే సాధారణ ఎన్నికల వరకు కలిసి ప్రయాణం చేస్తామని ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు.
ఏపీకి కేంద్రం ప్రత్యేకహోదా ఇస్తుందన్న నమ్మకంతోనే ఎదురుచూస్తున్నామన్నారు. పవన్‌కల్యాణ్ విమర్శలపైనా గల్లా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర అభివృధ్ధికి ఎంపీలు కృషి చేయడం లేదని పవన్ కల్యాణ్ అనడం సమంజసం కాదన్నారు. తాము రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నది పవన్‌కు వివరించేందుకు సిద్ధమన్నారు. అలా వివరించిన తర్వాతే పవన్ వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో స్పందిస్తామన్నారు.
బీజేపీతో పొత్తుపై గల్లా చాలా తెలివిగానే, అధినేత మనసెరిగి మాట్లాడినట్టుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల వరకు కలిసి ఉంటాం ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు. గతంలోనూ టీడీపీ ఇదే ఫార్ములాను పాటించింది. ఎన్నికల వరకు ఎదురుచూడడం ఆ సమయంలో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతారో ఆయా పార్టీలతో దోస్తి కట్టడం టీడీపీ సాధారణ రాజకీయ ఎత్తుగడే. గతంలోనూ బీజేపీకి ఇలాగే టీడీపీ హ్యాండిచ్చింది. రాజధాని గుంటూరు జిల్లాకు రావడం తనకు సంతోషంగా వుందని తన పర్యటనలో గల్లా జయదేవ్ అన్నారు.
Click on Image to Read: