తప్పు రోజాదా? రామోజీదా?

టీడీపీ నేతలు వీలుదొరికినప్పుడల్లా రోజాను టార్గెట్ చేస్తుంటారు. ఆమెను మానసికంగా కార్నర్ చేస్తుంటారు. అందుకోసం పదేపదే జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తుంటారు. ద్వంద్వ అర్థాలతో సాగే ఒక జుగుప్సాకరమైన జబర్దస్త్‌ ప్రోగ్రామ్ లో పాల్గొనే రోజానా మాకు నీతులు చెప్పేది అని చాలాసార్లు టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఒకవిధంగా రోజా వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసిన ప్రతిసారి జబర్దస్త్ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తుంటారు. టీడీపీ నేతలే కాదు వారి మద్దతు దారులు కూడా జబర్దస్త్ మీదుగానే రోజాను టార్గెట్ చేస్తుంటారు. […]

Advertisement
Update:2016-03-24 09:09 IST

టీడీపీ నేతలు వీలుదొరికినప్పుడల్లా రోజాను టార్గెట్ చేస్తుంటారు. ఆమెను మానసికంగా కార్నర్ చేస్తుంటారు. అందుకోసం పదేపదే జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తుంటారు. ద్వంద్వ అర్థాలతో సాగే ఒక జుగుప్సాకరమైన జబర్దస్త్‌ ప్రోగ్రామ్ లో పాల్గొనే రోజానా మాకు నీతులు చెప్పేది అని చాలాసార్లు టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఒకవిధంగా రోజా వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసిన ప్రతిసారి జబర్దస్త్ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తుంటారు. టీడీపీ నేతలే కాదు వారి మద్దతు దారులు కూడా జబర్దస్త్ మీదుగానే రోజాను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా చందోలు శోభారాణి అనే హైకోర్టు న్యాయవాది రోజాను విమర్శిస్తూ జబర్దస్త్ లాంటి జుగుప్సాకరమైన, ద్వంద్వ అర్థాలు వచ్చే షోలో ప్రజాప్రతినిధి అయిన రోజా ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. రోజాను తిట్టారు కాబట్టి ఒక వర్గం మీడియా శోభారాణి వ్యాఖ్యలను ప్రచురణ కల్పించింది.

టీడీపీ నేతలు కానీ, న్యాయనిపుణులు కానీ నిజంగా జబర్దస్త్ ఒక జుగుప్సాకరమైన కార్యక్రమమే అయితే దాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. జుగుప్సాకరమైన కార్యక్రమం, ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడలేని ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంటే దాన్ని అడ్డుకోవాలనే గానీ, దానిలో యాంకర్‌గా వెళ్లిన వ్యక్తిని టార్గెట్ చేయడం ఒక విధంగా విచిత్రమే. సరే కార్యక్రమంలో రోజా ఏమైనా డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతున్నారా అంటే అది లేదు కదా?. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అవుతున్నది రామోజీరావుకు చెందిన ఈటీవీలో.

అసభ్యతకు ఈటీవీ ఆమడంత దూరం అన్న ఒక ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి రామోజీ గ్రూప్‌లో ఇలాంటి కార్యక్రమం ఎందుకు ప్రసారం అవుతున్నట్టు!. సమాజం మీద నిజంగా చిత్తశుద్ది ఉన్న వారు వెళ్లి రామోజీని నిలదీయాలి కదా?. ఇలాంటి కార్యక్రమాలు ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించవచ్చు కదా. అది చేయకుండా ఎంతసేపు జబర్దస్త్‌లో రోజా వల్లే ఏమో జరిగిపోతోందన్నట్టుగా టార్డెట్ చేయడం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ విషయంలో రోజాను విమర్శించే వారంతా ధైర్యముంటే రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లి నిలదీయాలని సూచిస్తున్నారు. అయినా ఆ పని చేయడానికి టీడీపీ నేతలేమైనా అమాయకులా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News