వెంకయ్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ గట్టి వార్నింగ్ !

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీరుపై ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా సీరియస్‌గా స్పందించింది. మంగళవారం జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ మీటింగ్‌లో వెంకయ్య అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు… ”ప్రధాని మోదీని అతిగా పొగిడేశారు. మోదీ దేవుడిచ్చిన వరం, ఆయనో దైవదూత” అంటూ పొగిడేశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎనలేని కోపం తెప్పించింది. నేతలు వ్యక్తి పూజ మానుకుని పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలను హెచ్చరించారు. ఇది వెంకయ్యనాయుడును దృష్టిలో ఉంచుకునే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్టు భావిస్తున్నారు. […]

Advertisement
Update:2016-03-23 11:17 IST

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీరుపై ఆర్‌ఎస్‌ఎస్‌ చాలా సీరియస్‌గా స్పందించింది. మంగళవారం జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ మీటింగ్‌లో వెంకయ్య అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు… ”ప్రధాని మోదీని అతిగా పొగిడేశారు. మోదీ దేవుడిచ్చిన వరం, ఆయనో దైవదూత” అంటూ పొగిడేశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎనలేని కోపం తెప్పించింది.

నేతలు వ్యక్తి పూజ మానుకుని పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలను హెచ్చరించారు. ఇది వెంకయ్యనాయుడును దృష్టిలో ఉంచుకునే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధానంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్టు భావిస్తున్నారు. వ్యక్తి పూజ మానుకుని జాతీయ కోణంలో పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టం చేసింది. మోదీ దైవదూత ఆయన ఇండియాను పూర్తిగా మార్చివేస్తారంటూ వెంకయ్య నాయుడు వ్యక్తిపూజ చేస్తున్నారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. కేవలం అభివృద్ది అంశాలపైనే దృష్టిసారించాలని మంత్రులు, బీజేపీ నేతలకు జాగ్రత్తలు సూచించింది.

మరోవైపు వెంకయ్యనాయుడు తీరుపై బీజేపీలోనూ చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎవరి హవా కొనసాగుతుంటే వారిని పొగడడం వెంకయ్యకు తొలినుంచి అలవాటుగా మారిందన్నారు. గతంలో వాజ్‌పేయి, అద్యానీల హవా నడిచిన కాలంలో వారిద్దరిని ఇదే తరహాలో వెంకయ్య ఆకాశానికి ఎత్తేవారని గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు వెంకయ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశారు. అప్పట్లో మోదీ ఒక సాధారణ నాయకుడిగా ఉండేవారు. అలా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన వెంకయ్య ఇలా పదేపదే అవకాశాల కోసం ఉన్నత పదవుల్లో ఉన్న వారిని అసహజనంగా పొగడడం ఎబ్బేట్టుగా ఉందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News