అమెరికా సుప్రీం అవకాశం...భారత సంతతి వ్యక్తికి దక్కలేదు!
అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా భారతసంతతికి చెందిన శ్రీనివాసన్‌కే అవకాశం దక్కుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా అది నిజం కాలేదు. ఆ అవకాశం శ్రీనివాసన్‌కి కాకుండా మెర్రిక్ గార్లాండ్‌కు దక్కింది. మెర్రిక్ గార్లాండ్‌ని అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. సంప్రదాయవాది జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) మృతి చెందడంతో ఆ స్థానంలో భారత సంతతికి చెందిన జడ్జి శ్రీనివాసన్‌కు అవకాశం లభిస్తుందని గతనెలలో ఆయనపేరు తెరమీదకు వచ్చింది. మరో […]
అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా భారతసంతతికి చెందిన శ్రీనివాసన్‌కే అవకాశం దక్కుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా అది నిజం కాలేదు. ఆ అవకాశం శ్రీనివాసన్‌కి కాకుండా మెర్రిక్ గార్లాండ్‌కు దక్కింది. మెర్రిక్ గార్లాండ్‌ని అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశారు. సంప్రదాయవాది జస్టిస్ ఆంటోనిన్ స్కాలియా (79) మృతి చెందడంతో ఆ స్థానంలో భారత సంతతికి చెందిన జడ్జి శ్రీనివాసన్‌కు అవకాశం లభిస్తుందని గతనెలలో ఆయనపేరు తెరమీదకు వచ్చింది. మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేసే ఒబామా, జడ్జి నియామక నిర్ణయాన్ని తన వారసుడికి అప్పగించాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు కోరారు కానీ, తనకు రాజ్యాంగ పరంగా లభించిన హక్కులను వినియోగించుకుంటానని ఒబామా చెబుతూ వచ్చారు.
ఒబామా నిర్ణయం వెనుక ఎన్నికల ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సెనేట్ రిపబ్లికన్లు ఒబామాని హెచ్చరించారు. ఒబామా, డెమోక్రాట్లు మరో పదినెలలు సమయం ఉంది కదాని, తొలుత ఉపేక్షించారు. కానీ తరువాత అనేక చర్చలు, తర్జన భర్జనల అనంతరం ఒబామా, మెర్రిక్ గార్లెండ్ పేరుని ప్రకటించారు. గార్లాండ్ హార్వర్డ్ యూనివర్శిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు న్యాయపరమైన ఉన్నత పదవిని నిర్వహించారు.