ఇక కుక్క‌లూ హోట‌ల్స్‌కి వెళ్లొచ్చు!

న్యూయార్క్ సిటీ రెస్టారెంట్ల‌లో ఇక‌పై కుక్క‌ల‌కూ ప్ర‌త్యేక టేబుల్స్ అరెంజ్ చేస్తారు. వాటికి ఏం కావాలో అవి వ‌డ్డిస్తారు. న్యూయార్క్ సిటీ ఆరోగ్య శాఖ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  దీని ప్ర‌కారం ఇక‌పై హోట‌ళ్ల‌లో కుక్క‌లు తీరిగ్గా కూర్చుని, లేదా నిల‌బ‌డి వాటిని కావాల్సిన ప‌దార్థాల‌ను ఆర్డ‌రు చేసి (య‌జ‌మానులే ఆర్డ‌రు చేస్తారు) తినొచ్చు. లైసెన్సు ఉండి రేబిస్ రాకుండా వ్యాక్సిన్లు వేయించిన కుక్క‌ల‌కు అనుమ‌తి ఉంటుంది. ఇంత‌కుముందు య‌జ‌మానుల‌తో క‌లిసి కుక్క‌లు హోట‌ళ్ల‌కు […]

Advertisement
Update:2016-03-16 02:30 IST

న్యూయార్క్ సిటీ రెస్టారెంట్ల‌లో ఇక‌పై కుక్క‌ల‌కూ ప్ర‌త్యేక టేబుల్స్ అరెంజ్ చేస్తారు. వాటికి ఏం కావాలో అవి వ‌డ్డిస్తారు. న్యూయార్క్ సిటీ ఆరోగ్య శాఖ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం ఇక‌పై హోట‌ళ్ల‌లో కుక్క‌లు తీరిగ్గా కూర్చుని, లేదా నిల‌బ‌డి వాటిని కావాల్సిన ప‌దార్థాల‌ను ఆర్డ‌రు చేసి (య‌జ‌మానులే ఆర్డ‌రు చేస్తారు) తినొచ్చు. లైసెన్సు ఉండి రేబిస్ రాకుండా వ్యాక్సిన్లు వేయించిన కుక్క‌ల‌కు అనుమ‌తి ఉంటుంది. ఇంత‌కుముందు య‌జ‌మానుల‌తో క‌లిసి కుక్క‌లు హోట‌ళ్ల‌కు వ‌చ్చినా అవి లోప‌లికి రాకుండా బ‌య‌ట వేచి ఉండాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. కుక్క‌ల‌కోసం హోట‌ళ్ల‌లో ప్ర‌త్యేక టేబుల్స్‌ని ఏర్పాటుచేస్తారు. అక్క‌డి రాష్ట్ర శాస‌నస‌భ గ‌త సంవ‌త్స‌రమే ఈ విష‌యంలో ఒక చ‌ట్టాన్ని రూపొందించింది. దీన్ని బ‌ట్టి మున్సిపాలిటీలు ఎవ‌రికి తోచిన‌ట్టుగా వారు కుక్క‌ల‌కు బ‌య‌టి ప్ర‌దేశాల్లో డైనింగ్ ఏర్పాట్లు చేసుకోవ‌చ్చు. ముప్ప‌యిరోజుల్లో ఈ రూల్సుని అమ‌లుచేయ‌బోతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News