చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేకు రూ. 15 కోట్లు ఆఫర్ చేస్తూ ఎస్‌ఎంఎస్
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ గుట్టును వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. వైసీపీని వీడి వస్తే రూ. 30 కోట్లతో పాటు మంత్రి పదవి ఇస్తామని టీడీపీ నేతలు తనను ప్రలోభపెట్టారని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఇప్పటికే వెల్లడించగా.. తాజాగా మరో ఎమ్మెల్యే ఇదే తరహ విషయాన్ని మీడియాకు వివరించారు. ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే రూ. 15 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని చిత్తూరు జిల్లా […]
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ గుట్టును వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. వైసీపీని వీడి వస్తే రూ. 30 కోట్లతో పాటు మంత్రి పదవి ఇస్తామని టీడీపీ నేతలు తనను ప్రలోభపెట్టారని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఇప్పటికే వెల్లడించగా.. తాజాగా మరో ఎమ్మెల్యే ఇదే తరహ విషయాన్ని మీడియాకు వివరించారు. ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉంటే రూ. 15 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండేందుకు అంగీకరిస్తే ముందస్తుగా రూ. 10 కోట్లు ఇస్తామని టీడీపీ నేతలు ఫోన్‌లో చెప్పారని వివరించారు. మిగిలిన రూ. 5 కోట్లు ఓటింగ్ పూర్తయిన తర్వాత ఇస్తామని టీడీపీ నేతలు సునీల్‌కుమార్‌కు పదేపదే ఫోన్ చేస్తున్నారట. ఫోన్ కాల్స్తో పాటు ఆఫర్‌కు సంబంధించి ఎస్‌ఎంఎస్ కూడా వచ్చినట్టు వివరించారు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు ఈ విధంగా ఖూనీ చేస్తున్నారని సునీల్‌కుమార్ చిత్తూరు జిల్లా ఐరాలలో మీడియాతో చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా తనను టీడీపీ నేతలు ఎలా ప్రలోభపెట్టింది గురువారం వివరించారు. తొలుత రూ.5 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు అనంతరం ఆ రేటును మరింత పెంచారని రాజన్నదొర వెల్లడించారు. రూ. 5 కోట్లకు తాను స్పందించకపోయే సరికి రూ. 15 కోట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమన్నారని రాజన్నదొర చెప్పారు. ఆఖరికి రూ. 30 కోట్లు ఇచ్చేందుకు టీడీపీ నేతలు ముందుకొచ్చారని వెల్లడించారు. అయితే తాను లొంగలేదని వివరించారు.
Click on Image to Read: