లండన్లో ఫుడ్‌స్టోరుల్లో గోమూత్రం...వద్దంటున్న పర్యావరణవేత్తలు!
ప్లాస్టిక్ బాటిల్స్‌లో పోసి, సీల్ చేసిన గోమూత్రాన్నిలండన్లో ఆహార పదార్థాలు అమ్మే దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు. అక్కడి పర్యావరణవేత్తలు అలా చేయడం తగదని చెబుతుండగా వారి సూచనలను ఎవరూ పాటించడం లేదు. వీటిమీద… మతపరమైన కార్యక్రమాలకోసం అని ముద్రించి ఉంటుంది. బిబిసి ఏషియన్ నెట్‌వర్క్ ఈ వివరాలు వెల్లడించింది. మనదేశంతో పాటు దక్షిణ ఆసియా దేశాల్లో నివసించే హిందువులు గోమూత్రాన్ని ఔషధంగానే కాక మతపరమైన కార్యక్రమాల్లోనూ విరివిగా వాడతారు. అయితే ఇంగ్లండ్‌లో మనుషులు లోపలికి తీసుకునే వినియోగవస్తువుగా […]
ప్లాస్టిక్ బాటిల్స్‌లో పోసి, సీల్ చేసిన గోమూత్రాన్నిలండన్లో ఆహార పదార్థాలు అమ్మే దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు. అక్కడి పర్యావరణవేత్తలు అలా చేయడం తగదని చెబుతుండగా వారి సూచనలను ఎవరూ పాటించడం లేదు. వీటిమీద… మతపరమైన కార్యక్రమాలకోసం అని ముద్రించి ఉంటుంది. బిబిసి ఏషియన్ నెట్‌వర్క్ ఈ వివరాలు వెల్లడించింది.
మనదేశంతో పాటు దక్షిణ ఆసియా దేశాల్లో నివసించే హిందువులు గోమూత్రాన్ని ఔషధంగానే కాక మతపరమైన కార్యక్రమాల్లోనూ విరివిగా వాడతారు. అయితే ఇంగ్లండ్‌లో మనుషులు లోపలికి తీసుకునే వినియోగవస్తువుగా దీన్ని అమ్మడం నేరం. అదీకాక వీటిని తినే పదార్థాల మధ్యలో ఉంచవద్దని అక్కడి పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అయినా గోమూత్రం బాటిల్స్… బ్రెడ్, బిస్కెట్స్ వంటి ఆహారపదార్థాల ప్యాకెట్స్ మధ్య దర్శనమిస్తున్నాయి.
వాట్‌ఫార్డ్‌లో ఉన్న హరేకృష్ణ గుడికి గోశాల ఉంది. ఇక్కడి నుండి కూడా గోమూత్రాన్ని విక్రయిస్తుంటారు. ఆ గుళ్లో 1970ల నుండి గోమూత్రాన్ని అమ్ముతున్నట్టుగా దాని నిర్వాహకులు చెబుతున్నారు. దక్షిణ ఆసియా దేశాలనుండి వచ్చిన హిందువులు గోమూత్రాన్ని కొంటుంటారని, వారు పూజలు, శుద్ధి చేసే కార్యక్రమాల్లో, మతపరమైన విధుల్లో దాన్ని వినియోగిస్తుంటారని వారు చెబుతున్నారు. దీన్ని ఇతర అవసరాలకే తప్ప మనుషులు ఔషధంగా సేవించడానికి తాము అమ్మడం లేదని వారు చెబుతున్నారు. అయితే ఆహార వస్తువుల ప్రామాణిక సంస్థ మాత్రం దీన్ని ఔషధంగా తాగకపోయినా, బయటి పనుల్లోనే వినియోగించినా, దీని అమ్మకంలో చట్టపరమైన సమస్యలు ఉన్నాయని చెబుతోంది. గోమూత్రాన్ని ఆహార పదార్థాల మధ్య ఉంచి అమ్ముతున్నపుడు అది ఎలాంటి హాని చేయదని, సురక్షితమని రుజువు చేయాల్సి ఉంటుందని అక్కడి పర్యావరణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.