ఈ యాపారం ముందు ఆ వ్యాపారమెంత సార్?

చరిత్ర మొత్తం తిరిగేస్తే తమపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయనాయకుడు ఒకే మాట చెబుతుంటారు. నిరూపిస్తే ప్రజలకు ఆస్తులు రాసిస్తాం అని. కాని ఇప్పటి వరకు ఒక్క  రాజకీయ నాయకుడు కూడా ఆస్తులు రాసిచ్చింది లేదు. అంటే దేశంలో ఉన్న నేతలంతా నిజాయితీ పరులే అనుకోవాలా?. తాజాగా అమరావతిలో జరిగిన భూకుంభకోణంపై సాక్షి పత్రిక రాసిన “రాజధాని దురాక్రమణ” కథనంపై మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు కూడా అలాగే స్పందించారు. అందరు రాజకీయ నాయకుల తరహాలోనే ఎదురుదాడి […]

Advertisement
Update:2016-03-02 14:26 IST

చరిత్ర మొత్తం తిరిగేస్తే తమపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయనాయకుడు ఒకే మాట చెబుతుంటారు. నిరూపిస్తే ప్రజలకు ఆస్తులు రాసిస్తాం అని. కాని ఇప్పటి వరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆస్తులు రాసిచ్చింది లేదు. అంటే దేశంలో ఉన్న నేతలంతా నిజాయితీ పరులే అనుకోవాలా?. తాజాగా అమరావతిలో జరిగిన భూకుంభకోణంపై సాక్షి పత్రిక రాసిన “రాజధాని దురాక్రమణ” కథనంపై మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు కూడా అలాగే స్పందించారు. అందరు రాజకీయ నాయకుల తరహాలోనే ఎదురుదాడి చేశారు.

రాజధానిలో తమ భూములు ఉన్నట్టు నిరూపిస్తే పేదలకు పంచిపెడుతామని సవాల్ విసిరారు. ఇది అయ్యే పని కాదని అందరికీ తెలుసు!. అంతే కాదు సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలా చేసే హక్కు కూడా వారికుంది. కానీ ఈ మాత్రం కథనానికే పరువు నష్టం దావా వేస్తే ఇక టీడీపీ వ్యతిరేకులపై వారు చేసిన ఆరోపణల (నిరూపించలేని ఆరోపణలు)కు ఎన్ని పరువు నష్టం దావాలు దాఖలు చేయాలో !. జగన్ ఆస్తుల విలువ మొన్నటి వరకు లక్ష కోట్లు అన్నారు, ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అని టీడీపీ నేతలు వడ్డీ లెక్కలు చెబుతున్నారు. మరి జగన్‌కు ఆరు లక్షల కోట్లు ఉన్నట్టు టీడీపీ నేతలు నిరూపించగలరా?. సో టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా జగన్ ఆస్తులు లక్ష కోట్లు అంటూ పదేపదే ప్రసారం చేసిన కథనాలకు జరిగిన పరువు నష్టానికి లెక్కలు కడితే దాని విలువ ఎంతుంటుందో!. అసలు ఇలా పత్రిక కథనాలపై పరువు నష్టం దావాలు వేస్తే మీడియా సంస్థలన్నీ మరో పని చూసుకోవాల్సి ఉంటుంది.

మంత్రి నారాయణ మరో విషయం కూడా చెప్పారు. ప్రజా సేవ కోసం వ్యాపారాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆయన అంత త్యాగం చేసినా నారాయణ కాలేజీల్లో ఫీజులు మాత్రం తగ్గినట్టు లేవు. నారాయణ ప్రజాసేవ సంగతేమో గానీ కార్పొరేట్ విద్య దెబ్బకు పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. అయినా సీఎం తర్వాత సీఎం అంతటి వారు… రాజధాని భూముల వ్యవహారం మొత్తం నారాయణ చేతుల మీదుగానే నడుస్తోంది. ఇంతటి విలువైన రాజకీయ వ్యాపారంలోకి వచ్చాక కాలేజీల వ్యాపారం ఒక లెక్కనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో సాక్షి వెలుగులోకి తెచ్చిన కొన్ని అంశాలపై మంత్రులు సూటిగా స్పందించకపోవడం గమనార్హం. లింగమనేని ఎస్టేట్‌ను ల్యాండ్ పూలింగ్ పరిధి నుంచి ఎందుకు తప్పించారన్న ప్రశ్నకు మంత్రుల నుంచి మౌనమే సమాధానం. బాలకృష్ణ వియ్యంకుడికి వందల ఎకరాలు సమర్పించారో లేదో చెప్పలేకపోయారు. లింగమనేని ఎస్టేట్ తో పాటు కృష్ణాకరకట్టపై సీఎం అధికారిక నివాసం వంటి అంశాలపైనా మంత్రులు సమాధానం స్పష్టంగా చెప్పలేకపోయారు. ఎంత కవర్ చేసుకున్నా అమరావతిలో అక్రమాలు జరగడం లేదంటే నమ్మేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందన్న మాట మాత్రం వాస్తవం.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News