శృంగారంపై సుప్రీం ప్యానల్ కీలక ప్రతిపాదన
సుప్రీం కోర్టు నియమించిన ప్యానల్ పరస్పర అంగీకార శృంగారంపై కీలక ప్రతిపాదన చేసింది. సెక్క్ వర్కర్లు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే పోలీసులు జోక్యం చేసుకోకూడదని సూచించింది. సెక్స్‌వర్కర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రతిపాదించింది. దేశంలోని సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, వారికి మెరుగైన జీవితం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై 2011లో సుప్రీం కోర్టు ఒక ప్యానల్‌ను నియమించింది. వచ్చే నెలలో ప్యానల్ తన నివేదికను సమర్పించనుంది. వేశ్యవృత్తి ఒకరకంగా చట్టబద్ధమే అయినా కొన్ని చట్టాల వల్ల సెక్స్ వర్కర్లు […]
సుప్రీం కోర్టు నియమించిన ప్యానల్ పరస్పర అంగీకార శృంగారంపై కీలక ప్రతిపాదన చేసింది. సెక్క్ వర్కర్లు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే పోలీసులు జోక్యం చేసుకోకూడదని సూచించింది. సెక్స్‌వర్కర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రతిపాదించింది. దేశంలోని సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, వారికి మెరుగైన జీవితం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై 2011లో సుప్రీం కోర్టు ఒక ప్యానల్‌ను నియమించింది. వచ్చే నెలలో ప్యానల్ తన నివేదికను సమర్పించనుంది.
వేశ్యవృత్తి ఒకరకంగా చట్టబద్ధమే అయినా కొన్ని చట్టాల వల్ల సెక్స్ వర్కర్లు పోలీసుల చర్యలకు బలవుతున్నారని ప్యానెల్ అభిప్రాయపడింది. ‘స్వచ్ఛంద సెక్స్ వర్క్ అక్రమం కాదు కానీ, బ్రోతల్ హౌస్ నిర్వహించడం చట్టవ్యతిరేకమని చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో వేశ్యగృహాలపై పోలీసులు దాడి చేసినప్పుడు సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడంగానీ, జరిమానా విధించడంగానీ, వేధించడంగానీ చేయరాదు’ అని ప్యానెల్ స్పష్టం చేసింది.
అక్రమ మానవ రవాణా చట్టం 1956లోని సెక్షన్ 8లోని లైంగికంగా లోబర్చుకోవడం అనే పదాల్ని తొలగించాలని సూచించింది. దీన్ని దర్యాప్తు అధికారులు తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని ప్యానల్ తేల్చింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా.. సెక్స్ వర్కర్లపై, విటులపై చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ నేతృత్వంలోని ప్యానెల్ వెల్లడించింది. ఈ విధానానికి స్వస్తి పలకాలని సిఫార్సు చేసింది.
Click on Image to Read: