ఎర్రబెల్లి చెప్పిన ఆ ముగ్గురిలో మూడో వ్యక్తి ఎవరు?

టీటీడీపీ శరవేగంగా దెబ్బతింటోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే పార్టీని వీడగా తాజాగా టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా పార్టీని వీడడంతో మిగిలిన నేతలు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న సందర్భంగా ఎర్రబెల్లి … మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పడం ద్వారా టీడీపీ నేతలకు మరింత కంగారు పుట్టించారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై లెక్కలేసుకుంటున్నారు. 2014లో టీటీడీపీ తరపున మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 9 […]

Advertisement
Update:2016-02-11 04:02 IST

టీటీడీపీ శరవేగంగా దెబ్బతింటోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే పార్టీని వీడగా తాజాగా టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా పార్టీని వీడడంతో మిగిలిన నేతలు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న సందర్భంగా ఎర్రబెల్లి … మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పడం ద్వారా టీడీపీ నేతలకు మరింత కంగారు పుట్టించారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై లెక్కలేసుకుంటున్నారు. 2014లో టీటీడీపీ తరపున మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 9 మంది పార్టీని వీడి వెళ్లగా ఆరుగురు మాత్రమే మిగిలారు.

రేవంత్ రెడ్డి, మాగంటి గోపినాథ్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఖమ్మం జిల్లాకుచెందిన సండ్ర వెంకటవీరయ్య, ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాత్రమే ప్రస్తుతం పార్టీలో మిగిలారు. రేవంత్ రెడ్డి ఎలాగో టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం లేదు. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన మాగంటి గోపినాథ్ పార్టీ వీడడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు.పైగా ఆయనను గ్రేటర్ అధ్యక్షుడిగా కూడా నియమించారు.

ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే సండ్ర తీవ్రంగా స్పందించారు. ఎర్రబెల్లి నయవంచకుడు అని అభివర్ణించారు. పైగా సండ్ర ఓటుకు నోటు కేసులో నిందితుడు కూడా. కాబట్టి సండ్రపై టీడీపీ నేతలు పెద్దగా అనుమానం వ్యక్తం చేయడం లేదు. ఇక ఆర్‌. కృష్ణయ్య టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం మానేసి చాలా కాలమే అయింది. ఆయన బీసీ ఉద్యమంపైనే ఫోకస్ పెట్టే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆయన మరో పార్టీలో చేరే అవకాశం కూడా లేదంటున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలపై అనుమానపు చూపులు ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఏదైనాసాధ్యమే. ఎర్రబెల్లి పార్టీ వీడిన నేపథ్యంలో మిగిలిన వారి విషయంలోనూ అప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని చెబుతున్నారు

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News