టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీ!
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీడీపీని అతలాకుతలం చేస్తున్నాయి. గ్రేటర్‌లో తిరుగులేని బలముందన్న భావనలో ఇంతకాలం టీడీపీ నేతలు ఉంటూ వచ్చారు. కానీ ఆ భ్రమలు కూడా తొలగిపోవడం, టీడీపీ ఇక కోలుకునే సూచనలు కూడా కనిపించకపోవడంతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్యాకప్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ ఫలితాల తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధపడినట్టు చెబుతున్నారు. గ్రేటర్ తీర్పు చూసిన తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి నియోజక వర్గం అభివృద్ధికి ప్రయత్నించడమే మంచిదన్న భావనకు ఆయన […]
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీడీపీని అతలాకుతలం చేస్తున్నాయి. గ్రేటర్‌లో తిరుగులేని బలముందన్న భావనలో ఇంతకాలం టీడీపీ నేతలు ఉంటూ వచ్చారు. కానీ ఆ భ్రమలు కూడా తొలగిపోవడం, టీడీపీ ఇక కోలుకునే సూచనలు కూడా కనిపించకపోవడంతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్యాకప్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ ఫలితాల తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధపడినట్టు చెబుతున్నారు. గ్రేటర్ తీర్పు చూసిన తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి నియోజక వర్గం అభివృద్ధికి ప్రయత్నించడమే మంచిదన్న భావనకు ఆయన వచ్చారని కథనాలొస్తున్నాయి.
ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే బీసీ నేత ఆర్ . కృష్ణ య్య కూడా టీడీపీకి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. టీడీపీలో ఉంటూ బీసీల కోసం పోరాటం చేయడం వల్ల కృష్ణయ్యపై పలు విమర్శలు వస్తున్నాయి. కొందరు చంద్రబాబు చెప్పినట్టు కృష్ణయ్య వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని వీడి బీసీల కోసం పోరాటం చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 9 స్థానాలను గెలిచి ఉనికి చాటుకుంది. అయితే ఎన్నికల తర్వాత తలసాని, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్నలు పార్టీని వీడివెళ్లారు. మిగిలిన వారిలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగినా చంద్రబాబు హామీతో ఆగిపోయారు. తాజా ఫలితాల నేపథ్యంలో వారు ఒక నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒక్క జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఒక్కరే టీడీపీలో మిగిలినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద సెటిలర్లు ఉన్న గ్రేటర్‌లోనూ దారుణమైన, ఘోరమైన ఓటమితో తెలంగాణ టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమైంది.
Click on image to Read