బ్రెజిల్ కార్నివాల్‌కి జికా వైర‌స్ భ‌యం

పుట్ట‌క‌ముందే పిల్ల‌ల మెద‌డుమీద ప్ర‌భావం చూపిస్తున్న జికా వైర‌స్‌పై మ‌రింత‌గా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సందేన‌ని బ్రెజిల్‌లోని  ఒక బ‌యోమెడిక‌ల్ రీసెర్చి సంస్థ హెచ్చ‌రించింది. జికా వైర‌స్, దాని ఇన్‌ఫెక్ష‌న్‌కి గురైన పేషంట్ల లాలాజ‌లంలో, యూరిన్‌లో కూడా క‌నుగొన్నామ‌ని, గ‌ర్భ‌వ‌తులు బ్రెజిల్ కార్నివాల్ లో పాల్గొని ఆ సంద‌ర్భంగా అప‌రిచితుల‌ను ముద్దుపెట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయి క‌నుక, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, కార్నివాల్‌కి దూరంగా ఉండాల‌ని ఆ సంస్థ హెచ్చ‌రించింది. జికా వైర‌స్ గురించి ఇంత భీక‌రంగా వార్త‌లు వినిపిస్తున్నా, వేల‌మంది చిన్నారులు […]

Advertisement
Update:2016-02-06 02:30 IST

పుట్ట‌క‌ముందే పిల్ల‌ల మెద‌డుమీద ప్ర‌భావం చూపిస్తున్న జికా వైర‌స్‌పై మ‌రింత‌గా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సందేన‌ని బ్రెజిల్‌లోని ఒక బ‌యోమెడిక‌ల్ రీసెర్చి సంస్థ హెచ్చ‌రించింది. జికా వైర‌స్, దాని ఇన్‌ఫెక్ష‌న్‌కి గురైన పేషంట్ల లాలాజ‌లంలో, యూరిన్‌లో కూడా క‌నుగొన్నామ‌ని, గ‌ర్భ‌వ‌తులు బ్రెజిల్ కార్నివాల్ లో పాల్గొని ఆ సంద‌ర్భంగా అప‌రిచితుల‌ను ముద్దుపెట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయి క‌నుక, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, కార్నివాల్‌కి దూరంగా ఉండాల‌ని ఆ సంస్థ హెచ్చ‌రించింది. జికా వైర‌స్ గురించి ఇంత భీక‌రంగా వార్త‌లు వినిపిస్తున్నా, వేల‌మంది చిన్నారులు మెద‌డు సంబంధిత వ్యాధికి గురై పుడుతున్నా, బ్రెజిల్ ప్ర‌జ‌లు వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. కార్నివాల్ మైకంలో మునిగిపోయి వీధుల్లోకి వ‌చ్చి ఎంజాయి చేస్తున్నారు. ఈ నెల ఐదు, ప‌ది తేదీల న‌డుమ ఈ కార్నివాల్ జ‌రుగుతుంది. దుస్తులు లేక‌పోవ‌డం వ‌ల‌న దోమ‌లు కుట్టే అవ‌కాశం, ఆల్క‌హాల్, అప‌రిచితుల‌తో ముద్దులు ఇవ‌న్నీ క‌లిసి జికాని మ‌రింత‌గా పెంచుతాయ‌ని బ్రెజిల్ వైద్య‌రంగ నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు.

జికా, ఇన్‌ఫెక్ష‌న్‌కి గుర‌యిన పురుషుల వీర్య‌క‌ణాల్లో ఉండిపోయి వారి ద్వారా పుట్ట‌బోయే పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు సైంటిస్టులు భావిస్తూ వ‌చ్చారు. ఇప్ప‌డు దానితో పాటు లాలాజ‌లం, యూరిన్‌ల‌లో కూడా ఇది జీవించి ఉంటుంద‌ని తేలింది. మొద‌ట జికా వైర‌స్ దోమల‌ కార‌ణంగానే వ్యాపించినా, ఇప్పుడు జ‌రుగుతున్న కార్నివాల్ కార‌ణంగా అది ర‌క్త మార్పిడులు, లైంగిక కార్య‌కలాపాల వ‌ల‌న మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏ ద్రవం నుండి అయినా జికా వ్యాపించ‌గులుగుతుందా అనే విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లు ఇప్పుడు దృష్టి పెడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News