టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ మాజీ మంత్రి

టీడీపీ మాజీ మంత్రి కృష్ణయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అనుచరులతో కలిసి కారెక్కారు. ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని కృష్ణయాదవ్ విమర్శించారు. కొన్ని నెలల క్రితం గ్రేటర్ టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించి మాగంటి గోపినాథ్‌ను నియమించడంతో కృష్ణయాదవ్ చిన్నబుచ్చుకున్నారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ టికెట్ల కేటాయింపులోనూ మాగంటి గోపినాథ్ వర్గం … కృష్ణయాదవ్‌ వర్గానికి […]

Advertisement
Update:2016-01-25 07:11 IST

టీడీపీ మాజీ మంత్రి కృష్ణయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అనుచరులతో కలిసి కారెక్కారు. ఇటీవలే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని కృష్ణయాదవ్ విమర్శించారు. కొన్ని నెలల క్రితం గ్రేటర్ టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించి మాగంటి గోపినాథ్‌ను నియమించడంతో కృష్ణయాదవ్ చిన్నబుచ్చుకున్నారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ టికెట్ల కేటాయింపులోనూ మాగంటి గోపినాథ్ వర్గం … కృష్ణయాదవ్‌ వర్గానికి కావాలనే మొండి చేయి చూపిందని చెబుతున్నారు. అందుకే కృష్ణయాదవ్ పార్టీ వీడారని చెబుతున్నారు. కృష్ణయాదవ్ గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేశారు. అయితే నకిలీస్టాంపుల కుంభకోణంలో రాజీనామా చేసి జైలుకెళ్లారు. జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు తిరిగి టీడీపీలో చేర్చుకున్నారు.

Tags:    
Advertisement

Similar News