వరుసబెట్టి చంపేస్తాం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు చేశారు. పెంటగాన్‌లో సైనిక అధికారులు, భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఒబామా అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ అంతమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అనేది నామరూపాల్లేకుండా చేస్తామన్నారు. ఐసిస్ నాయకులందరినీ ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి చంపుతామని ప్రకటించారు. ఇప్పటికే ఇరాక్, సిరియా దేశాల్లో అమెరికా భద్రతా దళాలు స్థానికంగా ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గ్రూపులతో కలిసి […]
Advertisement
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు చేశారు. పెంటగాన్‌లో సైనిక అధికారులు, భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఒబామా అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ అంతమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అనేది నామరూపాల్లేకుండా చేస్తామన్నారు. ఐసిస్ నాయకులందరినీ ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి చంపుతామని ప్రకటించారు. ఇప్పటికే ఇరాక్, సిరియా దేశాల్లో అమెరికా భద్రతా దళాలు స్థానికంగా ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న గ్రూపులతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
ఐసిస్ అనధికార రాజధాని పట్టణం రఖాకు అన్ని రకాల వనరులు, సౌకర్యాలు అందకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచంలో ఏ మూల కూడా ఇస్లామిక్ స్టేట్ నాయకులు దాక్కోలేరు, మా తరువాత టార్గెట్ మీరే అని స్పష్టం చేశారు. తమ పోరాటానికి కలిసి రావాలని మిత్రదేశాలను ఒబామా ఆహ్వానించారు. ఇప్పటి వరకు జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది ఐసిస్ ముఖ్య నాయకులు చనిపోయారన్నారు. ఐసిస్ లీడర్లు ఎక్కడా దాక్కోకోలేరని, వాళ్లే నెక్ట్స్ టార్గెట్ అని హెచ్చరించారు.
Advertisement