కె.వి.ర‌మ‌ణాచారికి జైలు శిక్ష‌

కోర్టు ధిక్కార నేరంపై మ‌రో అధికారికి హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఈసారి కె .వి.ర‌మ‌ణాచారి వంతు. ఆయ‌న‌కి హైకోర్టు జైలుశిక్ష‌, రూ.15వేల జ‌రిమానా విధించింది. క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న కాలంనాటి కేసులో హైకోర్టు ఈ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీలు దాఖాలు చేయ‌డానికి వీలుగా తీర్పు అమ‌లును నిలుపుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయవాది అభ్య‌ర్థించారు. దాంతో న్యాయమూర్తి ఎం.ఎస్‌. రామ‌చంద్ర‌రావు తీర్పు అమ‌లును నాలుగువారాల‌పాటు నిలిపివేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఓ […]

Advertisement
Update:2015-12-04 08:35 IST
కోర్టు ధిక్కార నేరంపై మ‌రో అధికారికి హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఈసారి కె .వి.ర‌మ‌ణాచారి వంతు. ఆయ‌న‌కి హైకోర్టు జైలుశిక్ష‌, రూ.15వేల జ‌రిమానా విధించింది. క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న కాలంనాటి కేసులో హైకోర్టు ఈ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీలు దాఖాలు చేయ‌డానికి వీలుగా తీర్పు అమ‌లును నిలుపుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయవాది అభ్య‌ర్థించారు. దాంతో న్యాయమూర్తి ఎం.ఎస్‌. రామ‌చంద్ర‌రావు తీర్పు అమ‌లును నాలుగువారాల‌పాటు నిలిపివేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఓ కేసులో తీర్పు నిస్తూ క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఎస్‌.మ‌ణిమ్మ మ‌రికొంద‌రు భూముల‌కు కొత్త భూసేక‌ర‌ణ చ‌ట్టం కింద ప‌రిహారాన్ని చెల్లించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో అధికారుల‌పై పిటిష‌న‌ర్లు కోర్టు ధిక్కార పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. తీర్పు అమ‌లుచేయ‌క‌పోవ‌డానికి క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను బాధ్యునిగా ప్ర‌క‌టిస్తూ ఆయ‌న‌కు జైలుశిక్ష‌, జ‌రిమానా విధిస్తున్న‌ట్లు హైకోర్టు తీర్పు వెలువ‌రించింది.
Tags:    
Advertisement

Similar News