ఆశ్చర్యం...అది కూడా ఆరోగ్యమేనట!
మన ముఖాల్లో ఇతర ప్రాణుల్లోకంటే ఎక్కువగా హావభావాలు పలుకుతుంటాయి. ఆశ్చర్యం, ఆనందం, అతిశయం, అవమానం, అభిమానం…ఇంకా చాలా….సందర్భాన్ని బట్టి ముఖంలో భావాలను మార్చడం మనకు తెలుసు. అయితే ఈ భావ ప్రకటనకు మన ఆరోగ్యానికి సంబంధం ఉందంటే ఆశ్చర్యమే. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే …. ఆశ్చర్యమనే భావాన్ని ప్రకటించే శక్తి మనలో ఎంత ఉన్నది… అనేది మన గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్దారించడం. విషయమేమింటే ఎవరిమొహంలో అయితే ఆశ్చర్య భావం సరిగ్గా కనబడుతుందో వారికి గుండె, ఊపిరితిత్తుల […]
మన ముఖాల్లో ఇతర ప్రాణుల్లోకంటే ఎక్కువగా హావభావాలు పలుకుతుంటాయి. ఆశ్చర్యం, ఆనందం, అతిశయం, అవమానం, అభిమానం…ఇంకా చాలా….సందర్భాన్ని బట్టి ముఖంలో భావాలను మార్చడం మనకు తెలుసు. అయితే ఈ భావ ప్రకటనకు మన ఆరోగ్యానికి సంబంధం ఉందంటే ఆశ్చర్యమే. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే …. ఆశ్చర్యమనే భావాన్ని ప్రకటించే శక్తి మనలో ఎంత ఉన్నది… అనేది మన గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నిర్దారించడం. విషయమేమింటే ఎవరిమొహంలో అయితే ఆశ్చర్య భావం సరిగ్గా కనబడుతుందో వారికి గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యం వచ్చే అవకాశాలు తక్కువని సైంటిస్టులు అంటున్నారు. అమెరికా పరిశోధకులు, యాభైమందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. చికిత్సకోసం హాస్పటల్‌కి వచ్చిన పేషంట్లను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. పేషంట్లు ఎంతవరకు నవ్వుతున్నారు, ఎంత కోపంగా ఉన్నారు, ఆశ్చర్యాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు…అనే విషయాలను పరిశీలించి చూశారు.
పేషంట్లు ఎవరైతే గుండెనొప్పితో బాధపడుతున్నారో (గుండె సమస్య), ఊపిరిని సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారో (ఊపిరితిత్తుల సమస్య) వారి ముఖంలో భావాలు సరిగ్గా పలకకపోవడం పరిశోధకులు గమనించారు. ముఖ్యంగా ఆశ్చర్యాన్ని ప్రకటించడంలో పూర్తి అశక్తతతో ఉన్నవారిలో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తప్పనిసరిగా ఉండటం గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే ఈ పరిశోధనలు ఇంకా తొలిదశలోనే ఉన్నాయి. ఇవి ఒక కొలిక్కి వస్తే ఈ వ్యాధుల నిర్దారణ, చికిత్సల్లో ఈ అంశం ఒక ఉపకరణంగా మారవచ్చు. ఏదిఏమైనా ఆశ్చర్యం ఇంతపనిచేయడం ఆశ్చర్యమే!