వరంగల్ బీజేపీకి వెంకయ్య దెబ్బ?

వరంగల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు టైమ్ దగ్గర పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ బీజేపీ నేతలను బిత్తరపోయేలా చేసింది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి వస్తుంది,.. కేంద్రం నుంచి అధికంగా నిధులు తెచ్చి వరంగల్‌ను ఓ రేంజ్‌లో అభివృద్ధి చేస్తామంటూ టీ కమలనాథులు చెబుతూవచ్చారు. అయితే ఈ సమయంలోనే వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ దేశంలోని పలు రాష్ట్రాలకు పక్కా ఇళ్లను కేటాయించింది. చూసేవారికి […]

Advertisement
Update:2015-11-19 04:32 IST

వరంగల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌కు టైమ్ దగ్గర పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ బీజేపీ నేతలను బిత్తరపోయేలా చేసింది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి వస్తుంది,.. కేంద్రం నుంచి అధికంగా నిధులు తెచ్చి వరంగల్‌ను ఓ రేంజ్‌లో అభివృద్ధి చేస్తామంటూ టీ కమలనాథులు చెబుతూవచ్చారు. అయితే ఈ సమయంలోనే వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ దేశంలోని పలు రాష్ట్రాలకు పక్కా ఇళ్లను కేటాయించింది. చూసేవారికి కూడా ఇది వివక్షే అనిపించేలా ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 93వేల ఇళ్లను కేటాయించిన వెంకయ్య శాఖ… తెలంగాణకు మాత్రం కేవలం 10వేల 290 ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది.

ఇప్పుడు ఈ ఇళ్ల కేటాయింపే వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీతో కలిసి భీకరంగా పోరాటం చేస్తున్న బీజేపీ నేతలకు షాకిచ్చింది. ఏపీకి లక్షా 93 వేల ఇళ్లు కేటాయించి… తెలంగాణకు మాత్రం 10 వేల 290 ఇళ్లు కేటాయిస్తే ఇక ఏ ముఖం పెట్టుకుని ఓటర్ల దగ్గరకు వెళ్లగలమని బీజేపీ నేతలు వాపోతున్నారు. ఈ ప్రకటనేదో మరో నాలుగు రోజులు ఆగి చేసి ఉంటే సరిపోయేది కదా అని రుసరుసలాడుతున్నారు. ఇక్కడ రాజకీయాలపై అవగాహన ఉన్న వెంకయ్యనాయుడు నేతృత్వంలోని శాఖే ఇలా చేస్తే ఎలా అని వాపోతున్నారు.

మరోవైపు ఇదే అదనుగా కేసీఆర్‌కు చెందిన ”నమస్తే తెలంగాణ” పత్రిక ఈ ఇళ్ల కేటాయింపుపై మొదటి పేజీలోనే భారీ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణకు ”మరోసారి కేంద్రం ధోకా” అంటూ టైటిల్ పెట్టి వదిలింది. అదన్న మాట తెలంగాణ బీజేపీ నేతలకు తీరా బై ఎలక్షన్ వేళ వెంకయ్యవారి శాఖ ఇచ్చిన షాక్.

Tags:    
Advertisement

Similar News