భజరంగీ భాయిజాన్ వచ్చేస్తోంది!

ఎన్నాళ్లో వేచిన ఉదయం. పన్నెండేళ్ల ఎదురుచూపులకు ప్రతిఫలం.. పాక్ లో ఆశ్రయం పొందుతున్న గీతను భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే విడుదలైన భజరంగీ భాయిజాన్ సినిమా తర్వాత గీత కథ మీడియాలో ప్రసారం కావడంతో ఆమె ఉదంతం చర్చనీయాంశమైంది. హిందీలో రాయడం తప్ప ఏమీ గుర్తుపట్టలేని గీత తనది భారత్ అని చెప్పింది. అప్పటి నుంచి అధికారులు గీత తల్లిదండ్రులెవరో ఆరా తీశారు. మీడియాలో గీతను చూసిన పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ […]

Advertisement
Update:2015-10-16 03:04 IST

ఎన్నాళ్లో వేచిన ఉదయం. పన్నెండేళ్ల ఎదురుచూపులకు ప్రతిఫలం.. పాక్ లో ఆశ్రయం పొందుతున్న గీతను భారత్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవలే విడుదలైన భజరంగీ భాయిజాన్ సినిమా తర్వాత గీత కథ మీడియాలో ప్రసారం కావడంతో ఆమె ఉదంతం చర్చనీయాంశమైంది. హిందీలో రాయడం తప్ప ఏమీ గుర్తుపట్టలేని గీత తనది భారత్ అని చెప్పింది. అప్పటి నుంచి అధికారులు గీత తల్లిదండ్రులెవరో ఆరా తీశారు.
మీడియాలో గీతను చూసిన పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. దీంతో గీత ఎవరి బిడ్డో తెలుసుకోవడం అధికారులకు కష్టమైంది. వెంటనే అందరి ఫోటోలను పాక్ కు పంపారు. వాటిలో గీత తన పేరెంట్స్ ఫొటోను గుర్తుపట్టింది. గీత తల్లిదండ్రులను బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు.
11 ఏళ్ల వయసులో పాక్ సరిహద్దులు దాటివెళ్లిపోయింది. అప్పటి తనకు నుంచి కష్టాలే. అసలే దేశం కాని దేశం. మాటలూ రావు. చెవులు వినిపించవు. తనెవరో చెప్పుకునే పరిస్థితీ లేదు. ఎలా బయటపడాలో తెలియక ఇబ్బందిపడుతున్న సమయంలో గీతను ఓ స్వచ్ఛంద చేరదీసింది.
కరాచీకి చెందిన ఈదీ ఫౌండేషన్లోనే గీత11 ఏళ్ల వయసు నుంచి ఆశ్రయం పొందుతోంది. గీతను బీహార్ లోని ఆమె స్వస్థలానికి చేర్చేందుకు ఢిల్లీలోని విదేశాంగ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాక్ నుంచి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు చేస్తున్నారు. అన్నీ కొలిక్కి వస్తే త్వరలోనే గీత కన్నవారి దగ్గరికి చేరుతుంది.

Tags:    
Advertisement

Similar News