మంగళగిరిలో సెంట్రల్ జైలు
రాజధాని నగరానికి అవసరమైన అని హంగుల్లో భాగంగా అమరావతిలో సెంట్రల్ జైలును కూడా ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ భావిస్తోంది. ఇప్పటికే ఏపీలో రాజమండ్రి, విశాఖపట్నం, కడప, నెల్లూరులో సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి కొత్త రాజధాని కావడంతో అక్కడ కూడా ఓ సెంట్రల్ జైలు ఉండాలని జైళ్లశాఖ భావిస్తోంది. ఇందుకోసం 150 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం అంత భూమి ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. కేవలం 24 ఎకరాలు మాత్రం మంజూరు […]
రాజధాని నగరానికి అవసరమైన అని హంగుల్లో భాగంగా అమరావతిలో సెంట్రల్ జైలును కూడా ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ భావిస్తోంది. ఇప్పటికే ఏపీలో రాజమండ్రి, విశాఖపట్నం, కడప, నెల్లూరులో సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి కొత్త రాజధాని కావడంతో అక్కడ కూడా ఓ సెంట్రల్ జైలు ఉండాలని జైళ్లశాఖ భావిస్తోంది. ఇందుకోసం 150 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం అంత భూమి ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. కేవలం 24 ఎకరాలు మాత్రం మంజూరు చేసేందుకు అంగీకరించింది. కోర్ కేపిటల్ పరిధిని 30వేల ఎకరాలకు పెంచిన నేపథ్యంలో సెంట్రల్ జైలును మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జైళ్లశాఖ భావిస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ జైళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించడంతోపాటు మరింత ఆధునీకరిస్తామని ఆశాఖ ఐజీ సునీల్ కుమార్ తెలిపారు. విశాఖ, రాజమండ్రి జైళ్లలో చేనేత పరిశ్రమను ఏర్పాటు చేసి ఖైదీలకు అవసరమైన యూనిఫామ్స్ ను తయారు చేస్తామన్నారు. ఇందుకోసం 15 యూనిట్లు నెలకొల్పుతామన్నారు. 50లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి, విశాఖలో తయారైన వస్త్రాలను అన్ని జైళ్లకు పంపిణీ చేస్తామని సునీల్ కుమార్ తెలిపారు.