మాట మార్చిన వెంకయ్య...
ఇన్నాళ్లు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ చెప్పుకొస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ తన వైఖరిని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ముఖ్యమని వెంకయ్య వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తన తొలి ప్రాధాన్యత ప్రాజెక్టులేనని.. ఆతర్వాతే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు కూడా కొత్త ప్రాజెక్టులు రాక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆ […]
Advertisement
ఇన్నాళ్లు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ చెప్పుకొస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ తన వైఖరిని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ముఖ్యమని వెంకయ్య వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పొదలకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తన తొలి ప్రాధాన్యత ప్రాజెక్టులేనని.. ఆతర్వాతే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు కూడా కొత్త ప్రాజెక్టులు రాక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆ రాష్ట్రాలు ఇప్పటికీ ప్రాజెక్టుల అనుమతి కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు తీరవని హోదాకు మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలనే అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి పంచాయితీ వరకు కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని, ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉంటే మోడీ నేతృత్వంలో భారత్ శక్తివంతంగా ముందుకు వెళుతుందని వెంకయ్య వ్యాఖ్యానించారు.
Advertisement