సరిహద్దులో తోకముడిచిన చైనా సైనికులు!

చైనా-పాక్‌లు ఒక్కటవుతున్నాయని ఇటీవల వచ్చిన వార్తా సంకేతాలకు ఊతమిచ్చే సంఘటన గురువారం భారత్‌-చైనా సరిహద్దులో చోటు చేసుకుంది. ఒకవైపు పాకిస్థాన్‌ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వీలు చిక్కినప్పుడల్లా కాల్పులకు తెగబడుతూ ఉంటే… మరోవైపు చైనా కూడా భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేసింది. దీన్ని నిలువరించిన భారత సైన్యం సాహసానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. దాదాపు 500 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. భారత్‌-చైనా సరిహద్దులోకి పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న చైనా […]

Advertisement
Update:2015-10-01 17:46 IST

చైనా-పాక్‌లు ఒక్కటవుతున్నాయని ఇటీవల వచ్చిన వార్తా సంకేతాలకు ఊతమిచ్చే సంఘటన గురువారం భారత్‌-చైనా సరిహద్దులో చోటు చేసుకుంది. ఒకవైపు పాకిస్థాన్‌ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వీలు చిక్కినప్పుడల్లా కాల్పులకు తెగబడుతూ ఉంటే… మరోవైపు చైనా కూడా భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేసింది. దీన్ని నిలువరించిన భారత సైన్యం సాహసానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. దాదాపు 500 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. భారత్‌-చైనా సరిహద్దులోకి పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న చైనా సైనికులను భారత సైన్యం నిలువరించింది. ముందు కొంచెం సేపు వాదించాక చైనా సైనికులు తమ దూకుడును ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. దీంతో భారత సైన్యం ధైర్యంగా నిలబడి వారిని కట్టడి చేశారు. మానవహారంగా నిలబడి అడుగు ముందుకు వేయకుండా అడ్డుపడ్డారు. తాము పెట్రోలింగ్‌ చేయడానికి వచ్చామని చెబుతున్న చైనా సైనికుల మాటలకు అడ్డుతగిలి అలా అయితే ఐదారుగురు రావాలి కాని ఇలా 500 మంది ఎందుకు వచ్చారని నిలదీశారు. చైనా సైనికులు చెబుతున్న పొంతన లేని సమాధానాలతో భారత సైనికులు ఎదురు తిరిగారు. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో ‘హిందీ-చీనీ భాయ్‌ భాయ్‌’ అంటూ వెనక్కి తగ్గారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నోటి నుంచి వెలువడిన ఈ మాటలు ఉచ్చరిస్తూ ముందడుగు వేయబోయిని వారిని ‘ఏ నినాదం చేసినా ముందుకు కదలనివ్వం’ అని తేల్చి చెప్పడంతో వెనక్కి మళ్ళారు. ఈ మొత్తం దృశ్యాలను భారత సైనికులు కెమెరాలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో చూస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్‌ జవాన్‌ జిందాబాద్‌ అంటూ జయజయధ్వనులు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News