మౌనమేలనోయి వేటగాడా!

టీఆర్‌ఎస్‌ నేతలను సింహంలా వేటాడేస్తానంటూ పదేపదే చెప్పిన‌ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మౌనంగా ఉండడం చర్చనీయాంశమైంది.  గతంలో సభ ప్రారంభమైన మరుక్షణమే అరుపులు కేకలతో హోరెత్తించే రేవంత్ మంగళవారం అసెంబ్లీలో మౌనముద్రను ఆశ్రయించారు. జరుగుతున్న చర్చను చూస్తూ ఉండిపోయారే గానీ ఎక్కడా రేవంత్ రవ్వంత కూడా స్పందించలేదు. ఈ తీరు చూసి తోటి సభ్యులే ఆశ్చర్యపోయారు. రేవంత్ రెడ్డికి మౌనంగా ఉండడం కూడా తెలుసా అని జోకులేసుకున్నారు. రేవంత్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్న దానిపై నేతలు ఆసక్తిగా […]

Advertisement
Update:2015-09-30 07:28 IST
టీఆర్‌ఎస్‌ నేతలను సింహంలా వేటాడేస్తానంటూ పదేపదే చెప్పిన‌ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మౌనంగా ఉండడం చర్చనీయాంశమైంది. గతంలో సభ ప్రారంభమైన మరుక్షణమే అరుపులు కేకలతో హోరెత్తించే రేవంత్ మంగళవారం అసెంబ్లీలో మౌనముద్రను ఆశ్రయించారు. జరుగుతున్న చర్చను చూస్తూ ఉండిపోయారే గానీ ఎక్కడా రేవంత్ రవ్వంత కూడా స్పందించలేదు. ఈ తీరు చూసి తోటి సభ్యులే ఆశ్చర్యపోయారు. రేవంత్ రెడ్డికి మౌనంగా ఉండడం కూడా తెలుసా అని జోకులేసుకున్నారు. రేవంత్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారన్న దానిపై నేతలు ఆసక్తిగా చర్చించుకున్నారు. కొన్ని కారణాలను కనిపెట్టారు.
తన కోసం అధికార పార్టీ పన్నిన ప్రత్యేక వ్యూహం వల్లే రేవంత్ ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారని భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఎక్కువ చేసినా సభ నుంచి బయటకు పంపించేయాలని టీఆర్ఎస్ ముందే నిర్ణయించుకుంది. రేవంత్ లాంటి వ్యక్తి సభలో ఉండేందుకు అర్హత లేదని వీలైతే ఈ సమావేశాలు జరిగినన్ని రోజులు బయటకు పంపించాలని ఎత్తువేసింది. గతంలో సమగ్ర సర్వే సమయంలో ఎంపీ కవితపై చేసిన ఆరోపణల వల్ల గత అసెంబ్లీ సెషన్ మొత్తం రేవంత్‌కు చెక్ పెట్టారు. అధికార పార్టీ ఎత్తులు గమనించే రేవంత్ వ్యూహాత్మకంగా తొలిరోజు చర్చ సమయంలో మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
రెండు మూడు రోజుల తర్వాత రేవంత్ విశ్వరూపం చూపుతారని చెబుతున్నారు. తొలిరోజే దూకుడుగా వ్యవహరిస్తే ఓటుకు నోటును సాకుగా చూసి సభ నుంచి బయటకు పంపే ఎత్తుగడను అధికార పక్షం వేయవచ్చని…అదే రెండు రోజులు మౌనంగా ఉండి ఆపై విరుచుకుపడితే ప్రభుత్వానికి ఆ అవకాశం ఉండదంటున్నారు. ఒకవేళ సభ నుంచి సస్పెండ్ చేసినా ప్రజాసమస్యలపై నిలదీసినందుకే తనను బయటకు పంపారని చెప్పుకునేందుకు రేవంత్‌కు అవకాశం దొరుకుతుంది. ఓటుకు నోటును సాకుగా చూపేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే అసెంబ్లీలో రేవంత్‌ మాట్లాడే అవకాశం అధికార పార్టీ కల్పిస్తుందనుకోవడం మాత్రం దురాశేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. రేవంత్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తున్నందున ఈ సమయంలో దూకుడు మంచిది కాదని కూడా రేవంత్ భావిస్తున్నారట. చూడాలి వేటగాడు రాబోయే రోజుల్లో ఎలా వేటాడుతాడో!.
Tags:    
Advertisement

Similar News