మన ఆయుధ నిల్వలు 15 రోజులకే..!
యుద్ధ పరికరాలు దిగుమతి చేసుకోవడంలో భారతదేశం ప్రంపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. మరి అంతగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న ఇండియాలో.. ఇప్పటికిప్పడు యుద్ధం వస్తే.. ప్రస్తుతం ఉన్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రి ఈడ్చి కొడితే.. 15 రోజులకు మాత్రమే సరిపోతాయట. ఓ వైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదు దాడులు, చైనా దురాక్రమణల భయం నిత్యం వెంటాడుతున్న వేళ ఇలాంటి వార్త ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ఆయుధ నిల్వలపై రక్షణమంత్రిత్వశాఖకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం […]
యుద్ధ పరికరాలు దిగుమతి చేసుకోవడంలో భారతదేశం ప్రంపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. మరి అంతగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న ఇండియాలో.. ఇప్పటికిప్పడు యుద్ధం వస్తే.. ప్రస్తుతం ఉన్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రి ఈడ్చి కొడితే.. 15 రోజులకు మాత్రమే సరిపోతాయట. ఓ వైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదు దాడులు, చైనా దురాక్రమణల భయం నిత్యం వెంటాడుతున్న వేళ ఇలాంటి వార్త ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ఆయుధ నిల్వలపై రక్షణమంత్రిత్వశాఖకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ విషయాలను వెల్లడించింది. వెంటనే ఆయుధ సామగ్రి పెంపు, ఉత్పత్తిపై దృష్టి సారించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. రక్షణశాఖ వ్యవహారాలపై మంగళవారం ఈ పార్లమెంటరీ సంఘం సమీక్ష జరిపింది.
దేశంలో మందుగుండు కొరతతోపాటు, ఆయుధాలు తరలించడానికి అనువైన రోడ్లు లేవన్న విషయాన్ని ఎత్తిచూపింది. ముఖ్యంగా చైనా సరిహద్దులో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించింది. జాతీయ రహదారుల అథారిటీకి, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, రోడ్ల నిర్వహణపై సరైన స్పష్టత లేకపోవడం వల్ల రహదారుల నిర్వహణ ఆశించిన స్థాయిలో జరగడంలేదని అభిప్రాయపడింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తోన్న సైనికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, రిటైర్డ్, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమంపైనా దృష్టి సారించాలని సూచించింది.
వన్ ర్యాంకు- వన్ పెన్షన్ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. పరిస్థితి ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్లి ఉండేది కాదని కమిటీ అభిప్రాయపడింది. రిటైర్డ్ మేజర్ జనరల్ బీసీ ఖండూరి అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులుగా ఉండగా, మంగళవారం జరిగిన సమావేశానికి ముగ్గురు మినహా మిగిలినవారంతా హాజరయ్యారు.