సోషల్ మీడియాకు ఆ శక్తి ఉంది: మోదీ
సోషల్, డిజిటల్ మీడియాలకు ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన సీఈఓల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆపిల్, గూగుల్, ట్విట్టర్ తదితర సంస్థల సీఈఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఊహించని విధంగా ప్రజల జీవితాన్ని మార్చే శక్తి డిజిటల్ యుగానికి ఉందని అన్నారు. ప్రస్తుతం పిల్లలకు గూగుల్ వల్ల ఉపాధ్యాయులకు, కుటుంబంలో పెద్దలకు సరైన పాత్ర లేకుండా పోయిందని మోదీ చమత్కరించారు. తమ ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతకు […]
Advertisement
సోషల్, డిజిటల్ మీడియాలకు ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన సీఈఓల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆపిల్, గూగుల్, ట్విట్టర్ తదితర సంస్థల సీఈఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఊహించని విధంగా ప్రజల జీవితాన్ని మార్చే శక్తి డిజిటల్ యుగానికి ఉందని అన్నారు. ప్రస్తుతం పిల్లలకు గూగుల్ వల్ల ఉపాధ్యాయులకు, కుటుంబంలో పెద్దలకు సరైన పాత్ర లేకుండా పోయిందని మోదీ చమత్కరించారు. తమ ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతకు పెద్దపీట వేసిందని, దీని సాయంతో దేశంలో పేదరికంపై యుద్ధాన్నే ప్రకటించిందన్నారు. డిజిటల్ ఎకానమీలో అమెరికా- ఇండియా భాగస్వామ్యానికి ఈ వేదిక నిదర్శనంగా నిలించిందని వర్ణించారు. ఇంతమంది సీఈఓలతో సమావేశం కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement