డేటింగ్‌లో ట్రైనింగ్‌కు ఓ కాలేజ్
వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్షరసత్యం. బాయ్, గాళ్ ఫ్రండ్స్‌ని వెతుక్కోవడంలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి, పరిచయమైన వారితో డేటింగ్ ఎలా చేయాలో తెలియని వారికి పాఠాలు చెప్పేందుకు ఇపుడు విద్యాసంస్థలు తయారవుతున్నాయి. దీనికి చైనాలో శ్రీకారం చుట్టారు. రాజధాని బీజింగ్‌లో తియాంజిన్ విశ్వవిద్యాలయం డేటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయట. డేటింగ్ కోర్సులో 32 గంటలపాటు క్లాసులు ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను బట్టి ప్రాక్టికల్ […]
Advertisement
వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్షరసత్యం. బాయ్, గాళ్ ఫ్రండ్స్‌ని వెతుక్కోవడంలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి, పరిచయమైన వారితో డేటింగ్ ఎలా చేయాలో తెలియని వారికి పాఠాలు చెప్పేందుకు ఇపుడు విద్యాసంస్థలు తయారవుతున్నాయి. దీనికి చైనాలో శ్రీకారం చుట్టారు. రాజధాని బీజింగ్‌లో తియాంజిన్ విశ్వవిద్యాలయం డేటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయట. డేటింగ్ కోర్సులో 32 గంటలపాటు క్లాసులు ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను బట్టి ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేస్తారు. మంచి క్రెడిట్స్ పొందితేనే డేటింగ్‌కు అర్హత సాధించిన వారవుతారు. అబ్బాయిలు, అమ్మాయిల్లో ఎవరు బాగా ఎదుటివారిని అర్ధం చేసుకోగలరో వారికే ఎక్కువ మార్కులు వస్తాయని, వారే జీవితంలో మంచి అనుభవాలను సొంతం చేసుకుంటారని కోర్సు నిర్వాహకుడు కాంగ్ ఇంగ్ అంటున్నారు. ఈ యూనివర్శిటీలోనే మరో మంచి కోర్సు పెట్టారు. అదేమిటంటే ‘మేకింగ్ ఫ్రండ్స్ ఈజీ’. అన్నింటా ముందుండే చైనా ఈ విషయాల్లో కూడా ముందుండడం ఆశ్చర్యం పడాల్సిన పనిలేదు.
Advertisement