చిన్న వయసులోనే చిగుళ్లు వదులవుతాయా?
ఎంతోమంది చిన్న వయసులోనే చిగుళ్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ సమస్య ఎటువంటి సంకేతాలనివ్వకుండానే దంతాల మీద దాడి చేస్తుంది. చిగుళ్ల సమస్య ఉన్నప్పటికీ నొప్పి లేకపోవడంతో చాలా ఏళ్లపాటు సమస్య ఉన్నట్లే గుర్తించరు. నొప్పి లేకపోవడం, అవగాహన రాహిత్యంతో నిర్లక్ష్యం చేయడం వల్ల 40 ఏళ్లకే చిగుళ్లు వదులయిపోతుంటాయి. దీంతో దంతాల మధ్య సందులు రావడం , దంతాలు ఊడిపోవడం వంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆరు నెలలకోసారి లేదా కనీససం ఏడాదికోసారయినా దంతవైద్యులను సంప్రదించి పరీక్ష […]
ఎంతోమంది చిన్న వయసులోనే చిగుళ్ల అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ సమస్య ఎటువంటి సంకేతాలనివ్వకుండానే దంతాల మీద దాడి చేస్తుంది. చిగుళ్ల సమస్య ఉన్నప్పటికీ నొప్పి లేకపోవడంతో చాలా ఏళ్లపాటు సమస్య ఉన్నట్లే గుర్తించరు. నొప్పి లేకపోవడం, అవగాహన రాహిత్యంతో నిర్లక్ష్యం చేయడం వల్ల 40 ఏళ్లకే చిగుళ్లు వదులయిపోతుంటాయి. దీంతో దంతాల మధ్య సందులు రావడం , దంతాలు ఊడిపోవడం వంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆరు నెలలకోసారి లేదా కనీససం ఏడాదికోసారయినా దంతవైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.
చాలామంది ఒకటి లేదా రెండు దంతాలు ఊడిపోయిన తర్వాత డాక్టరును కలుస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్సలలో ఈ కండిషన్ లో ఉన్నప్పటికీ చికిత్స సాధ్యమే.చిగుళ్ల జబ్బు తీవ్రతను గుర్తించి ప్రత్యేక చికిత్సల ద్వారా మిగిలిన దంతాలనైనా కాపాడగలుగుతారు. వాటిని జీవితకాలం నిలిచేలా చేస్తారు. పంటికి ఆధారంగా ఉన్న ఎముక పాడైన ప్రదేశంలో బోన్ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా పంటి గట్టిదనాన్ని పెంచవచ్చు. పళ్లు ఊడడం ఒక్కటే కాదు! దంతాలు ఊడిపోతే ముఖం ఆకారం మారిపోతుంది. దవడ పళ్లు ఊడిపోవడం వల్ల వార్థక్య లక్షణాలు వస్తాయి. అసలు వయసుకంటే ఎక్కువగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఊడిన దంతాల స్థానంలో ఆర్టిఫీషియల్ టీత్ పెట్టించుకోవచ్చు.