గ్రీన్ బిల్డింగ్ సీఈవోగా భారతీయుడు

అమెరికాలో ప్రతిష్ఠాత్మక గ్రీన్‌బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ) కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన మహేశ్ రామానుజం నియమితులయ్యారు.  2009లో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడిగా చేరిన మహేశ్ రామానుజం… అంచెలంచెలుగా ఎదిగి సీఈవో స్థాయికి చేరుకున్నారు. మహేశ్ రామానుజం చెన్నై నగరానికి చెందిన వారు. భవనాల నిర్మాణ డిజైన్ల రూపకల్పనలో స్థిరత్వం, వాటి నిర్వహణ పద్ధతులను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న యూఎస్‌జీబీసీ సహ వ్యవస్థాపకుడు రిక్ ఫెడ్రిఝి వచ్చే ఏడాది చివరిలో వైదొలగనున్నారు. యూఎస్‌జీబీసీ […]

Advertisement
Update:2015-09-10 05:19 IST
అమెరికాలో ప్రతిష్ఠాత్మక గ్రీన్‌బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్‌జీబీసీ) కొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన మహేశ్ రామానుజం నియమితులయ్యారు. 2009లో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడిగా చేరిన మహేశ్ రామానుజం… అంచెలంచెలుగా ఎదిగి సీఈవో స్థాయికి చేరుకున్నారు. మహేశ్ రామానుజం చెన్నై నగరానికి చెందిన వారు. భవనాల నిర్మాణ డిజైన్ల రూపకల్పనలో స్థిరత్వం, వాటి నిర్వహణ పద్ధతులను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న యూఎస్‌జీబీసీ సహ వ్యవస్థాపకుడు రిక్ ఫెడ్రిఝి వచ్చే ఏడాది చివరిలో వైదొలగనున్నారు. యూఎస్‌జీబీసీ సీవోవో, గ్రీన్ బిజినెస్ సర్టిఫికెట్ సంస్థ అధ్యక్షుడిగా సేవలందించడంలో విజయం సాధించిన మహేశ్ రామానుజం స్ఫూర్తిదాయక ట్రాక్ రికార్డు సంపాదించారని యూఎస్‌జీబీసీ చైర్మన్ మార్గే అండర్సన్ తెలిపారు. సమగ్ర పరిజ్ఞానం గల నాయకుడిగా మహేశ్ రుజువు చేసుకున్నారన్నారు. తనపై సంస్థ నాయకత్వం నమ్మకం ఉంచి సీఈవోగా నియమించడం గర్వంగా ఉందని మహేశ్‌రామానుజం వ్యాఖ్యానించారు.
Tags:    
Advertisement

Similar News