బీఎస్ ఎఫ్ " పాక్‌రేంజ‌ర్ల చ‌ర్చ‌లు 9నుంచి

భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల ఉన్న‌తాధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నాయి. భార‌త స‌రిహ‌ద్దు సేన బీఎస్ ఎఫ్‌, పాక్ స‌రిహ‌ద్దు ద‌ళం పాక్ రేంజ‌ర్ల ఉన్న‌తాధికారులు ఈ భేటిలో పాల్గొన‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొనే16 మంది స‌భ్యుల బృందానికి పాక్ రేంజ‌ర్ల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఉమ‌ర్ ఫ‌రూఖ్ బుర్కీ నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈనెల 8 న ఈ బృందం మంగ‌ళ‌వారం అత్తారి-వాఘా స‌రిహ‌ద్దు ద్వారా భార‌త్‌లోకి రానుంది. త‌రువాత ఈనెల […]

Advertisement
Update:2015-09-07 04:30 IST
భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల ఉన్న‌తాధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నాయి. భార‌త స‌రిహ‌ద్దు సేన బీఎస్ ఎఫ్‌, పాక్ స‌రిహ‌ద్దు ద‌ళం పాక్ రేంజ‌ర్ల ఉన్న‌తాధికారులు ఈ భేటిలో పాల్గొన‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొనే16 మంది స‌భ్యుల బృందానికి పాక్ రేంజ‌ర్ల డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఉమ‌ర్ ఫ‌రూఖ్ బుర్కీ నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈనెల 8 న ఈ బృందం మంగ‌ళ‌వారం అత్తారి-వాఘా స‌రిహ‌ద్దు ద్వారా భార‌త్‌లోకి రానుంది. త‌రువాత ఈనెల 9న దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీలో బీఎస్ ఎఫ్ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ దేవేంద్ర కుమార్ పాఠ‌క్‌తో 9-13 వ‌ర‌కు ఐదురోజుల పాటు చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. జ‌మ్మూ-క‌శ్మీర్లో ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌, రాణ్ ఆఫ్ క‌చ్ ప్రాంతంలో అక్ర‌మ చొరబాట్లు గుజ‌రాత్ నుంచి అక్ర‌మ‌ర‌వాణా, స్మ‌గ్లింగ్ త‌దిత‌ర‌, ఉగ్ర‌వాదులు భార‌త్‌లోకి ప్రవేశించ‌డం త‌దిత‌ర విష‌యాల‌ను చ‌ర్చ‌ల్లో భార‌త్ లేవ‌నెత్త‌నుంది. ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా పాక్‌పై ఒత్తిడి తీసుకురావాల‌ని భార‌త్ యోచిస్తోంది. గ‌త నెల‌లో ఇరు దేశాధినేత‌ల మ‌ధ్య స‌మావేశం ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో ఈ చ‌ర్చ‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.
Tags:    
Advertisement

Similar News