సొంత కరెన్సీ ముద్రించిన ఐఎస్ ఉగ్రవాదులు
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన సొంత కరెన్సీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ‘రైజ్ ఆఫ్ ఖలీఫా, రిటర్న్ ఆఫ్ ద గోల్డ్ దినార్’ పేరుతో విడుదల చేసిన వీడియోలో ఐఎస్ తాము తయారు చేసిన బంగారు, వెండి, రాగి నాణేలను ప్రదర్శించింది. ఇస్లామిక్ ధర్మానికి అనుగుణంగా తమ నాణేలపై మనుషులు లేదా జంతువుల బొమ్మలను ముద్రించలేదని ఐఎస్ పేర్కొంది. ఓ నాణెంపై ఏడు గోధుమ కంకుల్ని ముద్రించారు. తాము నాణేలను ముద్రించనున్నట్టు గత నవంబర్‌లోనే ఐఎస్ ప్రకటించింది. డాలర్ […]
Advertisement
ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన సొంత కరెన్సీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ‘రైజ్ ఆఫ్ ఖలీఫా, రిటర్న్ ఆఫ్ ద గోల్డ్ దినార్’ పేరుతో విడుదల చేసిన వీడియోలో ఐఎస్ తాము తయారు చేసిన బంగారు, వెండి, రాగి నాణేలను ప్రదర్శించింది. ఇస్లామిక్ ధర్మానికి అనుగుణంగా తమ నాణేలపై మనుషులు లేదా జంతువుల బొమ్మలను ముద్రించలేదని ఐఎస్ పేర్కొంది. ఓ నాణెంపై ఏడు గోధుమ కంకుల్ని ముద్రించారు. తాము నాణేలను ముద్రించనున్నట్టు గత నవంబర్‌లోనే ఐఎస్ ప్రకటించింది. డాలర్ అనేది అమెరికా ఆధిపత్యానికి గుర్తుగా నిలుస్తుందని, దానికి పోటీగా తాము సొంత కరెన్సీని రూపొందిస్తున్నట్టు ఐఎస్ తెలిపింది.
Advertisement