గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్ డీజీపీ తన సొంత గ్రామమైన నరసింహపల్లిని దత్తత తీసుకున్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని ఈ గ్రామాన్ని డీజీపీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని, దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అలాగే గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తామని డీజీపీ రాముడు తెలిపారు. అఖిల భారత సర్వీసు అధికారులంతా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ డీజీపీ తన సొంత గ్రామమైన నరసింహపల్లిని దత్తత తీసుకున్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని ఈ గ్రామాన్ని డీజీపీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని, దత్తత తీసుకున్న గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అలాగే గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తామని డీజీపీ రాముడు తెలిపారు. అఖిల భారత సర్వీసు అధికారులంతా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆయన తన స్వగ్రామాన్నే దత్తతకు స్వీకరించారు.
Advertisement