టీఆర్ఎస్ నేత‌ల‌కు  కేసీఆర్ శ్రావ‌ణ‌మాసం ఆఫ‌ర్ 

ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు  శ్రావ‌ణ‌మాసం ఆఫ‌ర్  ప్ర‌క‌టించ‌నున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యినా ప‌ద‌వుల పంప‌కాలు జ‌ర‌గ‌క పోవ‌డంతో టీఆర్ఎస్ శ్రేణులు ప‌ద‌వుల కోసం చ‌కోర ప‌క్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్ష‌ణ  అతిత్వ‌రలో ఫ‌లించ‌నుంది. శ్రావ‌ణ‌మాసం మంచి రోజులు ప్రారంభం కాగానే నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వుల పందేరం చేయాల‌ని సీఎం నిర్ణ‌యించార‌ని స‌మాచారం. సీఎం అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం టీఆర్ ఎస్ భ‌వ‌న్‌లో జ‌రిగిన టీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో నాయ‌కుల‌కు ఈ […]

Advertisement
Update:2015-08-13 10:23 IST
ముఖ్య‌మంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు శ్రావ‌ణ‌మాసం ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌నున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యినా ప‌ద‌వుల పంప‌కాలు జ‌ర‌గ‌క పోవ‌డంతో టీఆర్ఎస్ శ్రేణులు ప‌ద‌వుల కోసం చ‌కోర ప‌క్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్ష‌ణ అతిత్వ‌రలో ఫ‌లించ‌నుంది. శ్రావ‌ణ‌మాసం మంచి రోజులు ప్రారంభం కాగానే నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వుల పందేరం చేయాల‌ని సీఎం నిర్ణ‌యించార‌ని స‌మాచారం. సీఎం అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం టీఆర్ ఎస్ భ‌వ‌న్‌లో జ‌రిగిన టీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో నాయ‌కుల‌కు ఈ హామీ ల‌భించిన‌ట్లు తెలిసింది. శ్రావ‌ణ‌మాసంలో ప‌ద‌వులు భ‌ర్తీ చేసుకుందాం. 12 దాకా కార్పోరేష‌న్లకు పాల‌క మండ‌ళ్లు నియ‌మిస్తా, మ‌రో ముప్పై న‌ల‌భై సంస్థ‌ల విష‌యంలో ఏపీ కిరికిరి పెడుతోంది. వీటి త‌ర్వాత దేవాల‌య క‌మిటీలు, ఆ త‌ర్వాత మార్కెట్ క‌మిటీల‌ను భ‌ర్తీ చేస్తా. పార్టీ క‌మిటీలు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆగ‌స్టు 15 త‌ర్వాత పార్టీ రాష్ట్ర‌, జిల్లా క‌మిటీల‌ను వేసుకుందామ‌ని ఆయ‌న చెప్పారు. దీంతో టీఆర్ఎస్ నేత‌లు నూత‌న ఉత్సాహంతో ఉన్నారు.
Tags:    
Advertisement

Similar News