రిషితేశ్వరీ మృతిపై విచారణ ప్రారంభం

జిల్లా కేంద్రమైన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన విద్యార్థిని రిషితేశ్వరీ మృతిపై నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీకి బాలసుబ్రమణ్యం నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ మూడు రోజులపాటు వర్సిటీలోనే ఉండి అధికారులు, సిబ్బంది, పోలీసులను విచారించనుంది. విద్యార్థులతోను, వారి తల్లిదండ్రులతోను రేపు బహిరంగ విచారణ చేయనుంది. ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇదిలావుండగా యూనివర్సిటీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులను కూడా లోపలికి […]

Advertisement
Update:2015-07-29 10:08 IST
జిల్లా కేంద్రమైన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన విద్యార్థిని రిషితేశ్వరీ మృతిపై నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీకి బాలసుబ్రమణ్యం నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ మూడు రోజులపాటు వర్సిటీలోనే ఉండి అధికారులు, సిబ్బంది, పోలీసులను విచారించనుంది. విద్యార్థులతోను, వారి తల్లిదండ్రులతోను రేపు బహిరంగ విచారణ చేయనుంది. ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇదిలావుండగా యూనివర్సిటీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులను కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో వారు కమిటీకి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిషితేశ్వరీకి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు.
Tags:    
Advertisement

Similar News