విమ్స్ కార్పొరేట్‌పరం... పావులు కదుపుతున్న బాబు
సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు… విశాఖపట్నం వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)ను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. తొలిదశ నిర్మాణం పూర్తయినా దానిని ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. విమ్స్ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాట మార్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. విమ్స్ ను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విమ్స్ కోసం సీపీఎం ఉద్యమాన్ని ఉధృతం చేసింది. […]
Advertisement
సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు…
విశాఖపట్నం వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)ను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతోంది. తొలిదశ నిర్మాణం పూర్తయినా దానిని ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. విమ్స్ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాట మార్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. విమ్స్ ను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విమ్స్ కోసం సీపీఎం ఉద్యమాన్ని ఉధృతం చేసింది. విమ్స్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ, పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా వెంటనే విమ్స్‌ను ప్రారంభించాలని కోరారు. విమ్స్ తొలి దశ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకుండా పిపిపి (పబ్లిక్ ప్రయివేట్ పార్ట్‌నర్ షిప్) పేరుతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. విమ్స్‌కు చుట్టుపక్కల ప్రయివేట్ సంస్థలకు స్థలాలు కేటా యించి, వారు ఆసుపత్రులను ఏర్పాటు చేసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుందని నర్సింగరావు వివరించారు. విమ్స్ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా మారుస్తామని చెప్పారని, ఇప్పుడు విమ్స్‌ను అసలు ప్రభుత్వమే నిర్వహించకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూడడం దుర్మార్గమన్నారు. పెద్ద పెద్ద భవనాలు, డాక్టర్లు అందుబాటులో ఉన్నందున విమ్స్‌ని తక్షణమే ప్రారంభించాలని డిమాండు చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
Advertisement