కాంగ్రెస్ సమరశంఖం!
నేటి నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బీజేపీపై సమరశంఖం పూరించిన కాంగ్రెస్ దాడికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, మోదీగేట్‌లో రాజస్తాన్ సీఎం వసుంధరా రాజేలు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతుండగా, ఎలాంటి రాజీనామాలు ఉండబోవని బీజేపీ అగ్రనేతలతోపాటు మోదీ కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ భేటిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు […]
Advertisement
నేటి నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బీజేపీపై సమరశంఖం పూరించిన కాంగ్రెస్ దాడికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. వ్యాపం కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, మోదీగేట్‌లో రాజస్తాన్ సీఎం వసుంధరా రాజేలు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతుండగా, ఎలాంటి రాజీనామాలు ఉండబోవని బీజేపీ అగ్రనేతలతోపాటు మోదీ కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ భేటిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు రాజీనామాలు చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది. ఆదర్శ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్, ఉద్యోగాల కుంభకోణంలో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్‌లు రాజీనామా చేశారని గుర్తు చేశారు. అవినీతిపరుడైన మోదీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఎలా సహకరిస్తారన్నారు. వ్యాపం కుంభకోణంలో జరిగిన 50 హత్యలు ఎవరు చేశారని ప్రశ్నించారు. చనిపోయినవారందరని పాకిస్తాన్ ఐఎస్ ఐ లేదా నక్సలైట్లు హత్య చేశారా? అని నిలదీశారు. దీంతో బీజేపీ నేతలకు నోట మాట లేకుండా పోయింది. ఏదేమైనా ఎవరూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవినీతిలేని పాలన, నల్లధనం తదితర హామీలపైనా కాంగ్రెస్ నిలదీయనున్నట్టు సమాచారం. దీంతో 21 రోజుల పాటు జరగనున్న సభ సజావుగా సాగుతుందా? లేదా అన్నది అనుమానాస్పదంగా మారింది.
Advertisement