ట్రాన్స్‌జెండర్ల కోసం రూల్స్ మార్పు!
సినిమా.. షాపింగ్… ఆస్పత్రి… బస్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ఎక్కడికెళ్లినా స్త్రీ, పురుషులకు విడివిడిగా టాయిలెట్లుంటాయి! కానీ ఇటీవలికాలంలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారు తమ టాయిలెట్లు ఇబ్బందులను ఏకరువు పెట్టడంతో ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్తాంప్టన్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలో చదువుకుంటున్న ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు, సిబ్బందికి వీలుగా ఉండేలా.. స్త్రీ, పురుషులు, ట్రాన్స్‌జెండర్లు, అంగవికలురు.. ఇలా అందరికీ ఒకే టాయిలెట్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ట్రాన్స్ జెండర్లకు ఇక తాము ఏ […]
Advertisement
సినిమా.. షాపింగ్… ఆస్పత్రి… బస్టాండులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ఎక్కడికెళ్లినా స్త్రీ, పురుషులకు విడివిడిగా టాయిలెట్లుంటాయి! కానీ ఇటీవలికాలంలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారు తమ టాయిలెట్లు ఇబ్బందులను ఏకరువు పెట్టడంతో ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నార్తాంప్టన్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలో చదువుకుంటున్న ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు, సిబ్బందికి వీలుగా ఉండేలా.. స్త్రీ, పురుషులు, ట్రాన్స్‌జెండర్లు, అంగవికలురు.. ఇలా అందరికీ ఒకే టాయిలెట్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ట్రాన్స్ జెండర్లకు ఇక తాము ఏ టాయిలెట్‌లోకి వెళ్లాలా అనే మీమాంస తప్పుతుంది. ఈ టాయిలెట్ల సంగతి ఇలా ఉంటే.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనుబంధ సెయింట్ కేథరీన్ కాలేజీ శతాబ్దాల నాటి సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది. ఆ కళాశాలలో జరిగే మర్యాద పూర్వక డిన్నర్లకు డ్రెస్ కోడ్ ఉంటుంది. దాని ప్రకారమే వెళ్లాలి. అలా కాకుండా అమ్మాయిలు ప్యాంట్లు, అబ్బాయిలు స్కర్ట్‌లు ధరించి వెళ్లడం నిషేధం. 1473 నుంచి ఉన్న నిషేధం ఇది. అయితే, ఆ కళాశాలలో ఇటీవలికాలంలో ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారంతా కలిసి ఒక ప్రచారోద్యమం నిర్వహించారు. వారి డిమాండ్లకు తలొగ్గిన కళాశాల యాజమాన్యం నిబంధనలను సవరించింది. ట్రాన్స్‌జెండర్లు ఏ రకమైన వస్త్రధారణలోనైనా డిన్నర్లకు హాజరయ్యేలా రూల్స్ మార్చి రాసింది.
Advertisement