సంక్షేమ పథకాల అమలులో మనమే గ్రేట్: చంద్రబాబు
తమ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సంక్షేమ పథకాలను అద్భుతంగా నిర్వహిస్తుందని, ఈ పథకాల అమలు విషయంలో నేతలు, కార్యకర్తలు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మహానాడు మూడో రోజున ఆయన వేదికపై ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం హామీలను పూర్తిగా అమలు చేస్తున్నందున కార్యకర్తలంతా దూకుడుగా ముందడుగేయాలని పిలుపు ఇచ్చారు. 14 వేల కోట్ల లోటుతో ఉన్న తమ ప్రభుత్వం రుణమాఫీ కింద ఒక్కో రైతుకు లక్షన్నర వెసులుబాటు […]
Advertisement
తమ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సంక్షేమ పథకాలను అద్భుతంగా నిర్వహిస్తుందని, ఈ పథకాల అమలు విషయంలో నేతలు, కార్యకర్తలు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మహానాడు మూడో రోజున ఆయన వేదికపై ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం హామీలను పూర్తిగా అమలు చేస్తున్నందున కార్యకర్తలంతా దూకుడుగా ముందడుగేయాలని పిలుపు ఇచ్చారు. 14 వేల కోట్ల లోటుతో ఉన్న తమ ప్రభుత్వం రుణమాఫీ కింద ఒక్కో రైతుకు లక్షన్నర వెసులుబాటు కల్పిస్తే… ధనిక రాష్ట్రంగా 17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ ఒక్కో రైతుకు లక్ష రూపాయల మేరకే రుణ మాఫీ కల్పించిందని, దీన్ని జనంలోకి తీసుకెళ్ళి తమ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత అనుకూలంగా ఉందో ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను సరైన విధంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని ఆయన అన్నారు. రుణ మాఫీ, వివిధ రకాల పింఛన్లు తదితర సంక్షేమ పథకాల కింద యేటా రూ. 40 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఆయన తెలిపారు. వచ్చే నెల 2 తేదీ నుంచి డ్వాక్రా మహిళల రుణాలను కూడా మాఫీ చేయనున్నామని చంద్రబాబు వెల్లడించారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల హామీల అమలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు… అంశాలపై తెలుగుదేశం మహానాడు శుక్రవారం నాలుగు తీర్మానాలను ఆమోదించింది. ఈ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, టీడీపీ విదేశాంగ విధానం తీర్మానాలను సుజనా చౌదరి ప్రవేశపెడుతూ ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ రాజకీయాలను శాసించిన పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా జనంలో ఎంత ఆదరణ తెచ్చుకున్నామో జాతీయ పార్టీగా కూడా అంతకన్నా ఎక్కువ ఆదరణ దక్కించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Advertisement