చైనాతో మన బంధం బలోపేతం: ప‌్రధాని మోడీ
చైనా : ప్రధాని నరేంద్రమోడి పర్యటనతో భారత్ – చైనాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. 63 వేల కోట్ల విలువైన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. సరిహద్దు వివాదం, వీసా విధానం, భారత్‌లో పెట్టుబడులు తదితర అంశాలపై రెండు దేశాలు కీలకమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మూడురోజుల పర్యటనలో భాగంగా చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో సమావేశమయ్యారు. సరిహద్దు సమస్య, పెట్టుబడులు, అభివృద్ధి తదితర అంశాలపై ఇరుదేశాల బృందాలు చర్చించాయి. ఈ సందర్భంగా […]
Advertisement
చైనా : ప్రధాని నరేంద్రమోడి పర్యటనతో భారత్ – చైనాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. 63 వేల కోట్ల విలువైన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. సరిహద్దు వివాదం, వీసా విధానం, భారత్‌లో పెట్టుబడులు తదితర అంశాలపై రెండు దేశాలు కీలకమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మూడురోజుల పర్యటనలో భాగంగా చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో సమావేశమయ్యారు. సరిహద్దు సమస్య, పెట్టుబడులు, అభివృద్ధి తదితర అంశాలపై ఇరుదేశాల బృందాలు చర్చించాయి. ఈ సందర్భంగా భారత్-చైనాలు 10 బిలియన్ డాలర్లు అంటే 63 వేల కోట్ల రూపాయలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు.
చెన్నై, చైనాలోని చెంగ్డూలో రాయబార కార్యాలయాల ఏర్పాటు, రెండు దేశాల మధ్య విద్య, స్కిల్ డెవలప్ మెంట్‌కు సంబంధించి పరస్పర సహకారం, చైనా సహకారంతో అహ్మదాబాద్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్, భారత విదేశాంగ మంత్రిత్వశాఖ-కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య సహాయ సహాకారాలు, రెండు దేశాల మధ్య రైల్వే యాక్షన్ ప్లాన్…. వ్యాపారం, పర్యాటకం, ఖనిజాలు, గనుల రంగాలలో పరస్పరం సహకరించుకోవడం, అంతరిక్ష సంబంధ విషయాలలో మైత్రి కొనసాగించడం తదితర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హైదరాబాద్, చైనాలోని గింగ్డౌ నగరాల మధ్య స్నేహపూర్వక వర్తక, వ్యాపార అంశంపై కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగింది.
సంతృప్తి వ్యక్తం చేసిన మోడి
చైనా పర్యటనపై ప్రధాని మోడి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయన్నారు. భారత్ – చైనా సరిహద్దులో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని మోడీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిపక్వతతో పరిష్కరించుకోవాలన్నారు. ద్వైపాక్షిక సహకారంపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్టు మోడి వెల్లడించారు. వీసా విధానం, సరిహద్దులో నదుల అంశాలు కూడా ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చాయి. సమాఖ్య వ్యవస్థలో పరస్పర సహకారం, అభివృద్ధిలో పోటీతత్వం ఉండాలన్న మోడి- దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని ఉద్ఘాటించారు. రాష్ర్టాలు వివిధ స్థాయిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని… వాణిజ్యం, పెట్టుబడులపై అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని ప్రధాని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య ఉన్న కఠినమైన సమస్యలను అధిగమించడానికి, ఆధునీకీకరణకు రాజకీయంగా బలోపేతం కావాలని, పరస్పర చర్చలు కొనసాగాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య బేధాభిప్రాయాలున్నప్పటికీ వాటికి అధిగమించడం పెద్ద సమస్య కాదన్నారు. సరిహద్దులో శాంతి స్థిరత్వాన్ని ఇరుదేశాలు కాపాడాలన్నారు. అంతకుముందు చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో కలిసి మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మోడికి గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో ఘన స్వాగతం లభించింది. మోడికి గార్డ్ ఆఫ్ ఆనర్‌తో చైనా సత్కరించింది.
Advertisement