మోడీవి చిల్ల‌ర ఎత్తుగ‌డ‌లు: చైనా

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 14న చైనాలో పర్యటన ప్రారంభించడానికి ముందే ఆయన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ చైనా ప్రభుత్వ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. మోడీ దేశీయంగా తన ప్రతిష్ఠను పెంచుకోడానికి సరిహద్దు వివాదం, చైనాతో భద్రతా సమస్యల విషయాలలో ‘చిల్లర ఎత్తుగడలు’ వేస్తున్నారంటూ షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌స్‌ రిసెర్చి ఫెలో హూ ఝియాంగ్‌ రాసిన వ్యాసాన్ని ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ప్రచురించింది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ దేశంలో […]

Advertisement
Update:2015-05-12 23:33 IST
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 14న చైనాలో పర్యటన ప్రారంభించడానికి ముందే ఆయన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ చైనా ప్రభుత్వ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. మోడీ దేశీయంగా తన ప్రతిష్ఠను పెంచుకోడానికి సరిహద్దు వివాదం, చైనాతో భద్రతా సమస్యల విషయాలలో ‘చిల్లర ఎత్తుగడలు’ వేస్తున్నారంటూ షాంఘై అకాడమీ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌స్‌ రిసెర్చి ఫెలో హూ ఝియాంగ్‌ రాసిన వ్యాసాన్ని ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ప్రచురించింది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ దేశంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ప్ర‌య‌త్నం చేయ‌డం మంచిదే కాని… త్వరత్వరగా జపాన్‌, అమెరికా, యురోపియన్‌ దేశాలతో సంబంధాలను పటిష్ఠం చేసుకునేందుకు ఆయన చిల్ల‌ర ఎత్తుగ‌డ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఝియాంగ్ పేర్కొన్నారు. అయితే గత ఏడాది మోడీ తీసుకున్న దౌత్యపరమైన చర్యల ద్వారా ఆయన దార్శనికుడు కాదనీ, వ్యవహారాలు చక్కబెట్టడంలో కుటిల నీతితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్పష్టమయ్యిందని వ్యాస‌క‌ర్త‌ పేర్కొన్నారు. కాగా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని చైనాలో యోగా ఉత్సవాలను నిర్వహించాలని భారత్‌ నిర్ణయించింది.
Tags:    
Advertisement

Similar News