చంద్రబాబుపై సూర్యాపేట పీఎస్‌లో కేసు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును విమర్శించడానికి తమ వృత్తిని అవమాన పరిచారంటూ గొర్రెల కాపరులు చంద్రబాబుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ లేకపోయి ఉంటే కేసీఆర్ గొర్రెల కాపరి అయ్యేవాడంటూ చంద్రబాబు తమను తేలిక భావంతో మాట్లాడారని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొర్రెల కాపరులను అవమాన పరిచిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండు చేశారు. కాగా కేసీఆర్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నాగార్జునసాగర్‌లో చంద్రబాబు దిష్ఠిబొమ్మ […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును విమర్శించడానికి తమ వృత్తిని అవమాన పరిచారంటూ గొర్రెల కాపరులు చంద్రబాబుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ లేకపోయి ఉంటే కేసీఆర్ గొర్రెల కాపరి అయ్యేవాడంటూ చంద్రబాబు తమను తేలిక భావంతో మాట్లాడారని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొర్రెల కాపరులను అవమాన పరిచిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండు చేశారు. కాగా కేసీఆర్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నాగార్జునసాగర్‌లో చంద్రబాబు దిష్ఠిబొమ్మ దగ్ధం చేశారు.
Advertisement