ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం: కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని, ఇందుకు అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర రక్షణ, ప్రణాలికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందన్న పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, కొత్త ప్రభాకర్ ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని రాయితీలిచ్చామని, ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ళపాటు ప్రత్యేక రాయితీలివ్వడానికి కేంద్రం నిర్ణయించిందని […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని, ఇందుకు అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర రక్షణ, ప్రణాలికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుందన్న పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, కొత్త ప్రభాకర్ ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని రాయితీలిచ్చామని, ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ళపాటు ప్రత్యేక రాయితీలివ్వడానికి కేంద్రం నిర్ణయించిందని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇప్పటికే కేంద్రం అమలు చేసిందని, ఇందులో ఏపీకి, తెలంగాణకు ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేశామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం కూడా సిఫార్సు చేయలేదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.
Advertisement