బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడే మాయగాళ్ళ అరెస్టు

బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసుకుని వెళ్ళే ఖాతాదారులను మాయచేసి చోరీలకు పాల్పడే ఓ ముఠాను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. ఈమధ్యే మార్టూరులోని ఎస్ బీఐ, ఆంధ్రా బ్యాంకూ వద్ద రెండు చోరీలు జరిగాయి. చింతపల్లిపాడు, మార్టూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి  లక్షన్నర రూపాయలను ఈ ముఠా కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించగా వారు మాచర్లకు […]

Advertisement
Update:2015-04-19 23:53 IST
బ్యాంకుల వద్ద నగదు డ్రా చేసుకుని వెళ్ళే ఖాతాదారులను మాయచేసి చోరీలకు పాల్పడే ఓ ముఠాను ప్రకాశం పోలీసులు పట్టుకున్నారు. ఈమధ్యే మార్టూరులోని ఎస్ బీఐ, ఆంధ్రా బ్యాంకూ వద్ద రెండు చోరీలు జరిగాయి. చింతపల్లిపాడు, మార్టూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి లక్షన్నర రూపాయలను ఈ ముఠా కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు మార్టూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించగా వారు మాచర్లకు చెందిన పఠాన్ మస్తాన్ వలి, అతనిభార్య వెంకట రమణమ్మ, కర్నూలుకు చెందిన రాంబాబులుగా తేలింది. వీరు ముగ్గురూ ఓ ముఠాగా ఏర్పడి సత్తెనపల్లి, పెదనందిపాడు, చెరుకుపల్లి, ఇంకొల్లు లలో బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు నేరాలను అంగీకరించారని, వారి వద్ద నుంచి 35 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News